సందీప్ కిషన్(Sundeep Kishan) , రావు రమేష్ (Rao Ramesh) కలయికలో తెరకెక్కిన ‘మజాకా’ (Mazaka) మూవీ బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతోంది.’ధమాకా’ (Dhamaka) టాప్ లీగ్లో చేరిన త్రినాథ్ రావ్ నక్కిన (Trinadha Rao) దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఇది. ప్రసన్నకుమార్ బెజవాడ (Prasanna Kumar) కథ, స్క్రీన్ ప్లే అందించారు. ఫిబ్రవరి 26న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది. అయినా డీసెంట్ ఓపెనింగ్స్ అయితే వచ్చాయి. కానీ మిక్స్డ్ టాక్ ఎఫెక్ట్, పరీక్షల సీజన్ కారణంగా ఓపెనింగ్స్ అనుకున్న స్థాయిలో రావడం లేదు.
ప్రస్తుతానికి కొన్ని ఏరియాల్లో స్టడీగా రాణిస్తుంది. బి,సి సెంటర్ ఆడియన్స్ కామెడీ కోసం థియేటర్లకు వెళ్తున్నారు. కానీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ చాలా పెద్దగా ఉంది. రెండో వీకెండ్ ను క్యాష్ చేసుకుంటే తప్ప బ్రేక్ ఈవెన్ కష్టమే అని చెప్పాలి. ఒకసారి 8 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 1.64 cr |
సీడెడ్ | 0.67 cr |
ఉత్తరాంధ్ర | 0.70 cr |
ఈస్ట్ | 0.22 cr |
వెస్ట్ | 0.17 cr |
గుంటూరు | 0.40 cr |
కృష్ణా | 0.37 cr |
నెల్లూరు | 0.16 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 4.33 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ | 0.84 cr |
తెలుగు వెర్షన్ (టోటల్) | 5.17 cr |
‘మజాకా’ (Mazaka) చిత్రానికి రూ.10.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.11 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 8 రోజుల్లో ఈ సినిమా రూ.5.17 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.5.83 కోట్ల షేర్ ను రాబట్టాలి. గ్రాస్ పరంగా రూ.9.79 కోట్లు రాబట్టింది.