Mazaka: ‘మజాకా’.. ఈ సీన్లకి సెన్సార్ వారు అభ్యంతరాలు..!

సందీప్ కిషన్ (Sundeep Kishan) , రీతువర్మ (Ritu Varma) జంటగా నటించిన చిత్రం ‘మజాకా'(Mazaka). ఫిబ్రవరి 26న విడుదల కాబోతోంది ఈ చిత్రం. ‘ఎకె ఎంటర్టైన్మెంట్స్’ ‘హాస్య మూవీస్’ ‘జీ స్టూడియోస్’ ..లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. ‘ధమాకా’ (Dhamaka) తర్వాత త్రినాథ్ రావ్ నక్కిన (Trinadha Rao) దర్శకత్వంలో రూపొందిన సినిమా ఇది. ప్రసన్న కుమార్ బెజవాడ (Prasanna Kumar) ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే అందించడం జరిగింది. ప్రమోషన్లో భాగంగా విడుదల చేసిన టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ‘మన్మధుడు’ హీరోయిన్ అన్షు (Anshu Ambani) దాదాపు 22 ఏళ్ల తర్వాత ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తుంది. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది. ఈ క్రమంలో ‘మజాకా’ కి కొన్ని చోట్ల సెన్సార్ వారు కత్తెర వేయడం కూడా జరిగింది.

Mazaka:

సినిమా ప్రారంభంలో మద్యం సేవించడం హానికరం అంటూ వాయిస్ ఓవర్ ఇస్తారట.

అలాగే రకుల్, బాలయ్య, రెజీనా రిఫరెన్స్..లతో వచ్చే సబ్ టైటిల్స్ ను కూడా డిలీట్ చేసినట్లు సమాచారం.

పోలీస్ స్టేషన్లో పోలీస్ మద్యం తాగుతున్నట్టు వచ్చే సీన్స్ లోని విజువల్స్ ని బ్లర్ చేశారట. అలాగే కింద కాషన్ మెసేజ్ కూడా ఇవ్వడం జరిగింది. సీన్ నెంబర్ 17 లో ఈ మార్పులు చేశారట.

టీడీపీ, జనసేన, పిఠాపురం ఎం.ఎల్.ఎ వంటి రిఫరెన్సులతో వచ్చే సబ్ టైటిల్స్ ను కూడా డిలీట్ చేసినట్లు తెలుస్తుంది.

1 :36 : 05 గంటల వద్ద ‘నీ అమ్మ’ అంటూ వచ్చే డైలాగ్ ని డిలీట్ చేశారట.

అలాగే 1 :43 : 00 గంటల వద్ద వచ్చే ‘కడుపు వచ్చిన’ ‘ము*డ్డి’ అంటూ వచ్చే డైలాగులు కూడా మ్యూట్ చేశారట.

మొత్తంగా 150 నిమిషాల(2 గంటల 30) రన్ టైంలో 30 సెకన్లు ట్రిమ్ చేసినట్టు తెలుస్తుంది. ఇప్పుడు ఈ సినిమా రన్ టైం 149.30 నిమిషాలుగా ఉన్నట్టు సమాచారం.(యాడ్స్ వంటివి కాకుండా సినిమా రన్ టైం ఇది అని తెలుస్తుంది)

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus