Mazaka: మజాకా బిజినెస్.. ఎంతవస్తే హిట్?

టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ (Sundeep Kishan) తన 30వ సినిమాగా మజాకా తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. త్రినాథరావు నక్కిన  (Trinadha Rao) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫిబ్రవరి 26న గ్రాండ్ రిలీజ్ కానుంది. రీతూ వర్మ (Ritu Varma) హీరోయిన్ గా నటిస్తుండగా, అన్షూ (Anshu Ambani) మన్మధుడు ఫేమ్ కీలక పాత్రలో కనిపించనుంది. రావు రమేష్ (Rao Ramesh) సహా అనేకమంది సీనియర్ నటులు ఈ సినిమాలో భాగమవుతున్నారు. అయితే, సినిమాపై పాజిటివ్ బజ్ ఉండటంతో మజాకా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా చక్కగా జరిగింది.

Mazaka

రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేట్రికల్ హక్కులు సుమారు 9 కోట్ల రూపాయలకు అమ్మినట్లు సమాచారం. వరల్డ్ వైడ్ గా చూస్తే ఈ సినిమా 11 కోట్లకు పైగా బిజినెస్ చేసిందని టాక్. అలాగే, డిజిటల్, శాటిలైట్ హక్కులను జీ గ్రూప్ దక్కించుకున్నట్లు సమాచారం. ఈ డీల్ కింద థియేట్రికల్ రిలీజ్ తర్వాత మజాకా జీ5 ఓటీటీ, జీ తెలుగు ఛానెల్‌లో ప్రసారం కానుంది. ఇప్పుడు హిట్ అవ్వాలంటే సినిమా 12 కోట్లకు పైగా షేర్ రాబట్టాల్సిన పరిస్థితి ఉంది.

సందీప్ కిషన్ గతంలోనూ కొన్ని సినిమాలతో బాగానే ఆకట్టుకున్నప్పటికీ, ఈ సినిమా అతనికి కమర్షియల్ గా కాస్త బలమైన హిట్ కావాలి. కాబట్టి మజాకా 12 కోట్లు రాబట్టగలిగితే నిర్మాతలకు కూడా సేఫ్ జోన్ లోకి వెళ్ళినట్టే. ప్రస్తుతం సందీప్ కిషన్ ప్రమోషన్స్ స్పీడ్ పెంచి, అన్ని వేదికలపై సినిమాను హైలైట్ చేస్తున్నాడు. ఇటీవలే ఇంటర్వ్యూలలో సినిమా విశేషాలు పంచుకుంటూ, యూత్ లో హైప్ క్రియేట్ చేస్తున్నాడు.

ఈ సినిమా రిలీజ్ తర్వాత మార్చి 26 లేదా 28 లో జీ5 ఓటీటీలో కూడా సినిమా అందుబాటులోకి వస్తుందని టాక్. ఇక ఈ సినిమా విజయాన్ని లెక్కలోకి తీసుకుంటే, సందీప్ కిషన్ కి ఇదొక టర్నింగ్ పాయింట్ అవుతుందా లేదా అనేది బాక్సాఫీస్ రిజల్ట్ చెప్పాలి. హాస్య మూవీస్, ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తుండగా, లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నాడు. మరి, మజాకా (Mazaka) థియేట్రికల్ టార్గెట్ చేరుకుని హిట్ అవుతుందా అనేది వేచి చూడాలి.

హిట్టు కథకు రీమేక్.. వెంకీ కూడా చేస్తున్నాడా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus