రాజమౌళి పై సినీ అభిమానుల సెటైర్

  • December 27, 2016 / 09:21 AM IST

తెలుగు చిత్ర పరిశ్రమను అంతర్జాతీయ స్థాయికి తీసుకు వెళ్లిన డైరక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి. అందులో డౌట్  లేదు. కానీ ఈ దర్శకధీరుడుపై సినీ జనులు తాజాగా విరుచుకు పడుతున్నారు. ఒక సినిమాను బాగా తీయడంలో తప్పులేదు కానీ ఏళ్లతరబడి ఊరించడం మాత్రం తప్పేనని చెబుతున్నారు. బాహుబలి ని మూడేళ్ళుగా చిత్రీకరిస్తుండడం జక్కన్న ఓవర్ యాక్షన్ గా అభివర్ణిస్తున్నారు. ఇన్నిరోజులుగా షూటింగ్ చేయడం మార్కెట్ సూత్రమని విమర్శిస్తున్నారు. చారిత్రక సినిమా గౌతమి పుత్ర శాతకర్ణి ని కేవలం 80 రోజుల్లో క్రిష్ పూర్తి చేశారు. ఒకటవ శతాబ్దం నాటి సంగతులు వెతికి పట్టుకోవడమే మహా కష్టం.

అటువంటిది వేగంగా పరిశోధించడం, తెరకెక్కించడం సూపర్ పాస్ట్ జరిగిపోయాయి. ఔట్ ఫుట్ లో ఏమాత్రం వంకలు వెతకలేము. పైగా అద్భుతహా అనే స్థాయిలో టీజర్, ట్రైలర్ ఉన్నాయి. సినిమా కూడా సూపర్ హిట్ అని సినీ పండితులు ఇప్పటికే తేల్చి చెప్పేసారు. జక్కన్నకు మూడేళ్ళుగా సాధ్యంకానిది.. క్రిష్ కి మూడు నెలల్లో ఎలా సాధ్యమైంది? ఇదే ప్రశ్నను దర్శకధీరుడు ముందు ఉంచుతున్నారు. ఆ సంగతిని క్రిష్ వద్దకు ట్యూషన్ కి వెళ్లి తెలుసుకోవాలని రాజమౌళికి సలహా ఇస్తున్నారు. ఇక నుంచి అయినా చిత్రాలను వేగంగా తీయమని సూచిస్తున్నారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus