Meenakshi Chaudhary: అవసరమైతేనే అలాంటి సన్నివేశాలు చేస్తా.. మీనాక్షి చౌదరి

తెలుగు ఇండస్ట్రీలోని స్టార్ హీరోలు తమ సినిమాల్లో హీరోయిన్లను రిపీట్ చేయరని తెలిసిందే. ప్రస్తుతం ఒకే హీరోయిన్‌తో రెండు సినిమాలు చేయడమే గగనంగా మారిపోయింది. అందుకే హీరోయిన్ల కెరీర్ స్పాన్ తక్కువగా ఉంటుంది. ఇటీవలి సంవత్సరాల్లో పూజా హెగ్డే స్టార్ హీరోయిన్‌గా హవా చూపించింది. కానీ ఇప్పుడు తన పరిస్థితి కూడా మారిపోయింది. ఇప్పటికే నార్త్, సౌత్ ఇండస్ట్రీలను చుట్టేసిన బుట్టబొమ్మ రీసెంట్‌గా పవన్, మహేష్ సినిమాల నుంచి తప్పుకుంది.

ఈ క్రమంలోనే మహేష్ బాబు ‘గుంటూరు కారం’ చిత్రంలో మీనాక్షి చౌదరిని తీసుకున్నారు మేకర్స్. మొదటిసారి సూపర్‌స్టార్ చిత్రంలో నటించే చాన్స్ దక్కించుకున్న ఈ యంగ్ లేడీ.. ఇంతలోనే మెగా హీరోకు జోడీగా నటించే అవకాశం అందుకుంది. తాజాగా ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడిన మీనాక్షి..‘‘ప్రస్తుతం చాలా స్క్రిప్టులు వింటున్నాను. కథల ఎంపికలో జాగ్రత్త తీసుకుంటున్నాను. బిజీగా ఉండడం కోసం కాకుండా.. ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్రలు చేయాలి.

తెలుగు ప్రేక్షకులు నన్ను ఎంతో ఆదరిస్తున్నారు. ఏ భాషలో అయినా గొప్ప సినిమాల్లో అవకాశం వస్తే అది నాకు దక్కిన గౌరవంగా భావిస్తాను. తెలుగులో మూడు సినిమాల్లో నటిస్తున్నాను’’ అని చెప్పింది. అలాగే ‘గుంటూరు కారం’లో చాలామంది గొప్ప టెక్నిషియన్స్‌ పనిచేస్తున్నారని తెలిపింది. ఇక తెరపై ముద్దు సన్నివేశాల గురించి మీనాక్షి మాట్లాడుతూ..‘‘ఏదైనా సన్నివేశం నాకు అసౌకర్యంగా అనిపిస్తే దాన్ని ముందుగానే అంగీకరించను. ఇలా ఎన్నో సినిమాలు తిరస్కరించాను.

కథకు అవసరమైతేనే ముద్దు సన్నివేశాల్లో నటించాలని నియమం పెట్టుకున్నా. అశ్లీల సన్నివేశాల్లో అసలు నటించకూడదని నిర్ణయించుకున్నాను. దీని కారణంగా ఎన్నో అవకాశాలను తిరస్కరించాను. అలాగే కొత్త తరహా పాత్రల్లో నటించేందుకు వెనక్కి తగ్గను. అవకాశం ఉన్నప్పుడే విభిన్న పాత్రల్లో నటించాలని నా అభిప్రాయం ’’ అని మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) తన నిర్ణయాన్ని చెప్పింది.

ఆ హీరోల బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ తో పాటు ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్ ల లిస్ట్
తమ్ముడి కూతురి పెళ్ళిలో సందడి చేసిన శ్రీకాంత్ ఫ్యామిలీ.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus