మీనాక్షి చౌదరి ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో బాగా వినిపిస్తున్న పేరు. గత ఏడాది 2025 సంక్రాంతి బరిలో వెంకటేష్ హీరోగా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం ద్వారా తెలుగు సినీ ప్రేక్షకులకు మరింత దగ్గర అయ్యింది ఈ భామ. ‘ఇచ్చట వాహనాలు నిలుపరాదు’ చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ , ‘గోట్’ , ‘లక్కీ భాస్కర్’ మూవీలు కూడా వరుస విజయాలు సాధించటం జరిగింది. ప్రస్తుతం ఈ బ్యూటీ 2026 సంక్రాంతి బరిలో నిలవనున్న ‘అనగనగా ఒక రాజు’ మూవీ తో తన అదృష్టం మరోసారి పరీక్షించుకోబోతుంది.
‘అనగనగా ఒక రాజు’ మూవీలో నవీన్ పోలిశెట్టి హీరోగా నటిస్తుండగా డైరెక్టర్ మారి దర్శకత్వంలో, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగ వంశి నిర్మిస్తున్నారు. ఈ మూవీ కి సంబందించిన ప్రమోషన్లలో బిజీ బిజీగా ఉన్నారు మూవీ యూనిట్. ప్రత్యేకంగా హీరో నవీన్ మరియు హీరోయిన్ మీనాక్షి వరుస ఈవెంట్లు , ఇంటర్వ్యూలతో గ్యాప్ లేకుండా ప్రమోట్ చేస్తున్నారు. ఇంటర్వ్యూలలో భాగంగా అడిగిన ప్రశ్నలలో మీనాక్షి సమాధానమిస్తూ “తన జీవితంలో మొత్తం మూడు లక్ష్యాలు పెట్టుకున్నానని, మొదటిగా మిస్ ఇండియా అవ్వాలని, రెండవదిగా డాక్టర్ అవ్వాలని, చివరగా IPS ఆఫీసర్ అవ్వాలని అనుకుంది అంట”. అయితే మొదటి రెండు లక్ష్యాలను తాను నెరవేర్చుకున్నట్టు తెలిపింది. చివరి లక్ష్యమైన IPS అవ్వలేకపోయానని చెప్పుకొచ్చింది.

గత ఏడాది పొంగల్ బరిలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టిన మీనాక్షి చౌదరి ఈ 2026 సంక్రాంతి సినిమా పందెంలో ఎంత వరకు నెగ్గుకొస్తుందో చూడాలి మరి..?
