విడాకుల బాటలో మరో హీరోయిన్?
- December 14, 2016 / 10:34 AM ISTByFilmy Focus
మమతా మోహన్ దాస్, అమలా పాల్.. పెళ్లి చేసుకున్న తక్కువ టైమ్ కే విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం వారి జాబితాలో మీరా జాస్మిన్ చేరనుంది. అమ్మాయి బాగుంది, భద్ర, గుడుంబా శంకర్ చిత్రాల ద్వారా తెలుగు ప్రజలకు పరిచయమైన ఈ కేరళ కుట్టీ 2014 లో దుబాయ్ కి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అనిల్ జాన్ టైటస్ ను పెళ్లిచేసుకుంది. భర్తతో పాటు దుబాయ్ కి వెళ్లిన మీరా కొంతకాలం పాటు సంతోషంగా కలిసి ఉన్నారు. ఈ మధ్య భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతున్నట్లు తెలిసింది.
అందుకే ఈ అమ్మడు తాజాగా విడాకులకోసం దరఖాస్తు చేసినట్టు సమాచారం. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన మీరా మళ్లీ కరియర్ పై దృష్టి పెట్టింది. ప్రస్తుతం మాతృభాషలో మూడు సినిమాలకు సైన్ చేసింది. దీనిని బట్టి విడాకులు తీసుకునే నిర్ణయంలో మార్పు లేదని తెలుస్తోంది. అంతేకాదు ఇండియాలోనే స్థిరపడేందుకు ఇంటికోసం వెతుకుతున్నట్లు టాక్.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.















