Mega 158 : చిరు సరసన హీరోయిన్ గా ఆ భామ..? బాబీ ప్లాన్ మాములుగా లేదుగా..!
- January 23, 2026 / 12:51 PM ISTByFilmy Focus Desk
‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రం సంక్రాంతి బరిలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచి మెగా స్టార్ బాక్స్ ఆఫీస్ స్టామినా ఏంటో మరోసారి రుజువు చేసింది. కాగా, ఈ చిత్రం ఇంకా థియేటర్లలో హోస్ ఫుల్స్ తో రన్ అవుతూనే ఉంది, అప్పుడే చిరంజీవి నెక్స్ట్ మూవీ అప్ డేట్స్ కు సంబందించిన న్యూస్ కొన్ని నెట్టింట కొన్ని రోజులుగా చక్కర్లు కొడుతున్నాయి. అవేంటో చూసేద్దాం రండి.
Mega 158
మెగా 158 గా తెరకెక్కబోతున్న చిరంజీవి తదుపరి చిత్రానికి డైరెక్టర్ బాబీ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. మొన్నటిదాకా ఈ మూవీ లో చిరు పక్కన కూతురు రోల్ లో యంగ్ హీరోయిన్స్ కృతిశెట్టి లేదా అనశ్వర రాజన్ లలో ఒకరు నటించబోతున్నారని వార్తలు రాగా, ఇప్పుడు చిరంజీవి సరసన హీరోయిన్ గా ఒక సీనియర్ హీరోయిన్ నటించబోతుందని టాక్ గట్టిగా వినిపిస్తుంది. అయితే ఆమె ఎవరో కాదు, ఒకప్పుడు తెలుగులో మంచి విజయాలు అందుకున్న భామ ప్రియమణి. ఈ బ్యూటీ అయితే చిరు పక్కన కరెక్టుగా సెట్ అవుతుందని డైరెక్టర్ బాబీ ఆలోచన అంట. సీనియర్ హీరోల పక్కన యంగ్ హీరోయిన్స్ ని పెట్టి ట్రోల్ అవ్వటం కంటే వాళ్లకి సెట్ అయ్యే వాళ్ళని పెట్టడం బెటర్ అని డైరెక్టర్ ఇలా ప్లాన్ చేసాడని సమాచారం.

అయితే మొదట్లో బాలీవుడ్ అందాల తార ఐశ్వర్యారాయ్ ను చిరు పక్కన హీరోయిన్ క్యారెక్టర్ కు సంప్రదించినట్టు వార్తలు రాగా, అవి రూమర్స్ గానే మిగిలిపోయాయి. ఇప్పుడు ఈ ప్రియమణి వార్తల్లో అయినా నిజం ఎంత అనేది, చిత్ర యూనిట్ నుంచి ఆఫిసీయల్ కంఫర్మషన్ వచ్చేదాకా వేచి చూడాల్సిందే.













