Sreeja: శ్రీజకు మంగళవారం సినిమాకు అలాంటి సంబంధం ఉందా?

అజయ్ భూపతి దర్శకత్వంలో నటి పాయల్ నటిస్తున్నటువంటి తాజా చిత్రం మంగళవారం. ఈ సినిమా నవంబర్ 17వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో వరుస ఇంటర్వ్యూలకు హాజరుకావడమే కాకుండా తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను కూడా ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ సినిమా ఫ్రీ రిలీజ్ వేడుకకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

అలాగే ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా విడుదలైంది. ఇలా ఒక చిన్న సినిమాకు మెగాస్టార్ ఐకాన్ స్టార్ వంటి స్టార్ సెలబ్రిటీలు సపోర్ట్ చేయడం పట్ల అందరూ కూడా ఎంతో ఆశ్చర్యంతో పాటు సందేహాలను కూడా వ్యక్తం చేశారు. బహుశా అజయ్ భూపతితో మెగా కాంపౌండ్ నుంచి ఎవరైనా సినిమా చేస్తున్నారేమో అని అందరూ కూడా భావించారు.

తాజా సమాచారం ప్రకారం మెగా హీరోలు ఎవరు కూడా అజయ్ భూపతి దర్శకత్వంలో సినిమాలను చేసే ఆలోచనలో ప్రస్తుతానికి లేరని తెలుస్తుంది అయినప్పటికీ వీరందరూ కూడా ఒక చిన్న సినిమాకు సపోర్ట్ చేయడానికి గల కారణం ఏంటి అనే విషయం గురించి ఒక వార్త వైరల్ అవుతుంది. మెగాస్టార్ చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజకు మంగళవారం సినిమాకు సంబంధం ఉండడంతోనే మెగా హీరోలు ఈ సినిమాకు సపోర్ట్ చేస్తున్నారని తెలుస్తుంది.

మెగాస్టార్ చిన్న కుమార్తె (Sreeja) చిరంజీవి స్నేహితురాలు ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించారు. మంగళవారం మూవీ ప్రొడ్యూసర్ స్వాతి రెడ్డి మరెవరో కాదు .. ప్రముఖ బిజినెస్ మెన్ నిమ్మగడ్డ ప్రసాద్ కుమార్తె కావడం విశేషం ఇలా స్వాతి రెడ్డి ఈ సినిమాకు ప్రొడ్యూసర్ కావడంతో శ్రీజ కోరిక చిరంజీవి అల్లు అర్జున్ వంటి వారు ఈ సినిమాకు సపోర్ట్ చేస్తున్నారంటూ తాజాగా ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus