Klin Kaara: మెగా ఇంట్లో ఘనంగా వినాయక చవితి వేడుకలు!

  • September 19, 2023 / 07:18 PM IST

వినాయక చవితి పండుగ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రజలందరూ కూడా ఎంతో ఘనంగా వినాయక చవితి పండుగను జరుపుకున్నారు. ఈ క్రమంలోనే సెలబ్రెటీలు సైతం ఘనంగా వినాయక చవితి వేడుకలలో పాల్గొన్నారు. ఇక వినాయక చవితి పండుగకు సంబంధించిన ఫోటోలు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక మెగా కుటుంబంలో కూడా వినాయక చవితి పండుగ ఎంతో ఘనంగా జరిగిందని తెలుస్తోంది. వినాయక చవితి పండుగకు సంబంధించినటువంటి ఫోటోలను రామ్ చరణ్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు దీనితో ఈ ఫోటోలు వైరల్ అయ్యాయి.

అయితే ఈ వినాయక చవితి వేడుకలలో రామ్ చరణ్ కుమార్తె క్లీన్ కారా పాల్గొనడం విశేషం. ఇలా తన కుమార్తెతో మొదటి వినాయక చవితి పండుగ కావడంతో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ప్రస్తుతం రామ్ చరణ్ వినాయక చవితి పండుగకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. విగ్నేశ్వరుడి ఆశీస్సులతో అందరి జీవితాలలో విఘ్నాలు తొలగి సంతోషంగా ఉండాలని కోరుకున్నారు.

చిన్నారి క్లీన్ కార (Klin Kaara) తో కలిసి ఈ వినాయక చవితి జరుపుకోవడం విశేషం అంటూ ఈయన ఈ ఫోటోలను షేర్ చేశారు. ఇక ఈ ఫోటోలలో క్లిన్ కారా ఫేస్ కనపడకుండా ఎప్పటిలాగే ఉపాసన జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే మూడు నెలల తర్వాత క్లీన్ కారా చరణ్ ఇంటికి రావడంతో ఈమెకు ఘన స్వాగతం పలికారు.

ఇన్ని రోజులు ఉపాసన తన తల్లి గారి ఇంట్లోనే ఉన్నారు. చిన్నారికి మూడు నెలలు కావడంతో ఈమె మొదటిసారి తన కూతురుతో కలిసి అత్తారింట్లో అడుగు పెట్టారు. ఈ ఫోటోలలో ఉపాసన క్లిన్ కారా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారని చెప్పాలి.

మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus