వయనాడ్‌ కోసం చిరు – చరణ్‌ – బన్నీ… ఎంత ఇచ్చారంటే?

కేరళ రాష్ట్రంలోని వయనాడ్‌లో చోటు చేసుకున్న ప్రకృతి విపత్తు నేపథ్యంలో సెలబ్రిటీలు, సినిమా జనాలు తమ ఆపన్నహస్తాన్ని అందిస్తున్నారు. వయనాడ్‌ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడి వందలాది మంది మృత్యువాత పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పెద్ద ఎత్తున ఆస్తి నష్టం కూడా సంభవించింది. ఈ నేపథ్యంలో సహాయక చర్యల కోసం కేరళ ప్రభుత్వానికి దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆర్థిక సాయం చేస్తున్నారు సెలబ్రిటీలు. ఈ క్రమంలో టాలీవుడ్‌ నుండి ముగ్గురు హీరోలు తమ సాయాన్ని ప్రకటించారు.

తొలుత ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌  (Allu Arjun) రూ. 25 లక్షలు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత మెగాస్టార్‌ చిరంజీవి   (Chiranjeevi)  , మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ (Ram Charan)  కలసి రూ. కోటి ఇస్తున్నట్లు సోషల్‌ మీడియా వేదికగా అనౌన్స్‌ చేశారు. ‘‘వయనాడ్‌ జిల్లాలో ప్రాణాలు కోల్పోయిన వారిని చూసి నా గుండె తరుక్కుపోతోంది. ఆ ప్రాంత వాసులు తమ బాధ నుంచి త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా’’ అని తన చిరంజీవి తన పోస్ట్‌లో సానుభూతి వ్యక్తం చేశారు.

అల్లు అర్జున్‌ ఎక్స్‌ (మాజీ ట్విటర్‌)లో స్పందిస్తూ ‘‘వయనాడ్‌లో చోటుచేసుకున్న విషాదం పట్ల బాధపడుతున్నాను. కేరళ నాకు ఎప్పుడూ ప్రేమను పంచిస్తుంటుంది. ప్రస్తుతం మీ భద్రత, బలం కోసం ప్రార్థిస్తున్నాను’’ అని రాశారు. ఈ మొత్తాన్ని హీరోలు కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేయనున్నారు. మరోవైపు నటుడు మోహన్‌ లాల్‌ (Mohanlal)  స్వయంగా సహాయక చర్యల్లో పాల్గొన్నారు. తాను వ్యవస్థాపకుడిగా ఉన్న విశ్వశాంతి ఫౌండేషన్‌ ద్వారా రూ. మూడు కోట్ల విరాళం ఇస్తున్నట్టు తెలిపారు.

ఇప్పటికే ఇప్పటికే హీరో సూర్య (Suriya)  – జ్యోతిక – కార్తి (Karthi) రూ.50 లక్షలు, కమల్‌ హాసన్‌ (Kamal Haasan)  రూ. 25 లక్షలు, విక్రమ్‌(Chiyaan Vikram) రూ.20 లక్షలు, నయనతార (Nayanthara) విఘ్నేష్ శివన్‌ (Vignesh Shivan)  రూ.20 లక్షలు, మమ్ముట్టి (Mammootty) , దుల్కర్ సల్మాన్  (Dulquer Salmaan) రూ.35 లక్షలు, ఫహాద్‌ ఫాజిల్‌ (Fahadh Faasil)  రూ.25 లక్షలు, రష్మిక (Rashmika)  రూ.10 లక్షల విరాళం ప్రకటించారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus