Pawan Kalyan: పవన్ కోసం అభిమాని 600కి.మీ సైకిల్ యాత్ర!
- August 12, 2021 / 02:06 PM ISTByFilmy Focus
టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన పవన్ కళ్యాణ్ ను అభిమానించే వీరాభిమానులు కోట్ల సంఖ్యలో ఉన్నారు. పవన్ సినిమా రిలీజైతే టాక్ తో సంబంధం లేకుండా ఆ సినిమాకు రికార్డు స్థాయిలో కలెక్షన్లు వస్తాయి. కొన్ని నెలల క్రితం కరోనా బారిన పడిన పవన్ కళ్యాణ్ కరోనా నుంచి కోలుకుని వరుస సినిమా ఆఫర్లతో బిజీ అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఒక అభిమాని పవన్ కళ్యాణ్ పై ఉన్న అభిమానాన్ని సైకిల్ యాత్ర ద్వారా చాటుకున్నారు.
ఒక ఫ్యాన్ పవన్ కళ్యాణ్ కరోనా నుంచి కోలుకుంటే 600 కిలోమీటర్లు ప్రముఖ ఆలయాలకు సైకిల్ యాత్ర చేస్తానని మొక్కుకున్నారు. తిరుపతికి చెందిన ఈశ్వర్ కు మెగాస్టార్ చిరంజీవితో పాటు పవన్ కళ్యాణ్ అంటే ఎంతో అభిమానం. పవన్ కళ్యాణ్ తో పాటు మెగా ఫ్యామిలీకి చెందిన కొంతమంది హీరోలు కొన్ని నెలల క్రితం కరోనా బారిన పడగా వాళ్లు కోలుకుంటే కొండగట్టు ఆంజనేయస్వామి, తిరుమల వెంకటేశ్వరస్వామి, విజయవాడ కనకదుర్గమ్మను సైకిల్ పై దర్శించుకుంటానని ఈశ్వర్ కోరుకున్నారు.

మెగా హీరోలు కరోనా నుంచి కోలుకోవడంతో ఈశ్వర్ తిరుపతి నుంచి సైకిల్ యాత్రను మొదలుపెట్టారు. తిరుపతి నుంచి విజయవాడకు అక్కడినుంచి కొండగట్టు ఆంజనేయస్వామి టెంపుల్ వరకు ఈశ్వర్ సైకిల్ యాత్ర చేపట్టారు. 2024 సంవత్సరంలో పవన్ కళ్యాణ్ ను సీఎంగా చూడాలని తన కోరిక అని అందుకోసం ముక్కోటి దేవతలను ప్రార్థిస్తున్నానని ఈశ్వర్ తెలిపారు. ఈశ్వర్ సైకిల్ యాత్ర గురించి పవన్ కళ్యాణ్ ఆరా తీసినట్లు సమాచారం.
Most Recommended Video
నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

















