చిరంజీవి సెంటిమెంట్ ను ఆ హీరోలు రిపీట్ చేస్తారా?

2023 సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదలైన నిర్మాతలకు, బయ్యర్లకు, థియేటర్ల ఓనర్లకు కళ్లు చెదిరే లాభాలు సొంతం కావడానికి కారణమైన సినిమాగా వాల్తేరు వీరయ్య నిలిచింది. గత కొన్నేళ్లలో చిరంజీవి మార్కెట్, రేంజ్ పెరిగిందే తప్ప ఏ మాత్రం తగ్గలేదు. వాల్తేరు వీరయ్య సినిమా పెట్టుబడితో పోల్చి చూస్తే ఈ సినిమాకు 30 నుంచి 40 శాతం లాభాలు వచ్చినట్టు సమాచారం. ఈ సినిమా దర్శకుడిగా బాబీ స్థాయిని పెంచింది.

సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమాకు టికెట్ రేట్లు పెంచడం కూడా ఒక విధంగా కలిసొచ్చింది. అటు చిరంజీవి ఇటు రవితేజ ఏ రేంజ్ హిట్ ను కోరుకున్నారో ఈ సినిమాతో ఆ రేంజ్ హిట్ దక్కింది. అయితే ఈ ఏడాది మెగా హీరోల సినిమాలు ఎక్కువగానే రిలీజవుతున్నాయి. పవన్ క్రిష్ కాంబో మూవీ హరిహర వీరమల్లు ఈ ఏడాది దసరా కానుకగా రిలీజయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం.

దాదాపుగా 60 శాతం షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చరణ్ శంకర్ కాంబో సినిమా షూటింగ్ చాలా నెలల క్రితమే మొదలు కాగా ఈ ఏడాదే రిలీజ్ కానుంది. వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్, సాయితేజ్ కూడా వరుస ప్రాజెక్ట్ లతో ఈ ఏడాదే ఈ మెగా హీరోల సినిమాలు కూడా రిలీజ్ కానున్నాయి. స్టార్ హీరో అల్లు అర్జున్ కూడా ఈ ఏడాదే పుష్ప2 సినిమా రిలీజ్ కానుందని కామెంట్లు చేశారు.

మిగతా మెగా హీరోలు కూడా వరుస విజయాలను అందుకుని 2023 సంవత్సరాన్ని మెగా నామ సంవత్సరంగా మారుస్తారేమో చూడాల్సి ఉంది. మెగా హీరోలకు క్రేజ్, మార్కెట్ అంతకంతకూ పెరుగుతుండటంతో ఫ్యాన్స్ కూడా సంతోషిస్తున్నారు. రాబోయే రోజుల్లో మెగా హీరోలు మరిన్ని విజయాలను అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. మెగా హీరోలకు ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.

హంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పఠాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

సౌందర్య టు శృతి హాసన్.. సంక్రాంతికి రెండేసి సినిమాలతో పలకరించిన హీరోయిన్ల లిస్ట్..!
అతి తక్కువ రోజుల్లో వంద కోట్లు కొల్లగొట్టిన 10 తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus