Waltair Veerayya: వీరయ్య రిలీజ్ డేట్ మెగా అభిమానులను హర్ట్ చేసిందా?

చిరంజీవి బాబీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న వాల్తేరు వీరయ్య 2023 సంక్రాంతి పండుగ సందర్భంగా థియేటర్లలో రిలీజ్ అవుతుండగా హిట్ టాక్ వస్తే ఈ సినిమా కొత్త రికార్డులు క్రియేట్ చేయడం గ్యారంటీ అని ఫ్యాన్స్ భావిస్తున్నారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించిన ప్రకటన వెలువడింది. జనవరి 13వ తేదీన వాల్తేరు వీరయ్య మూవీ థియేటర్లలో రిలీజ్ కానుందని మేకర్స్ ప్రకటించారు. గత కొన్నిరోజులుగా ప్రచారంలో ఉన్న డేట్ ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

శుక్రవారం రోజున ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో మెగా ఫ్యాన్స్ మాత్రం హ్యాపీగా లేరని కామెంట్లు వినిపిస్తున్నాయి. పెద్ద సినిమాలలో చివరిగా వాల్తేరు వీరయ్య థియేటర్లలో రిలీజ్ అవుతుండటంతో ఈ సినిమా తక్కువ సంఖ్యలో థియేటర్లలో రిలీజవుతుంది. ఈ విధంగా రిలీజ్ కావడం వల్ల ఈ సినిమాకు కలెక్షన్ల విషయంలో రికార్డులు క్రియేట్ కావు.

అదే సమయంలో మొదట విడుదలైన సినిమాలకు పాజిటివ్ టాక్ వస్తే వాల్తేరు వీరయ్య మూవీ కలెక్షన్లపై ప్రభావం పడే అవకాశం అయితే ఉంటుంది. అయితే కొంతమంది అభిమానులు మాత్రం చిరంజీవి ప్లానింగ్ మామూలుగా ఉండదని చెబుతున్నారు. చిరంజీవి వాల్తేరు వీరయ్య కచ్చితంగా సక్సెస్ సాధించాలనే ఆలోచనతోనే రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారని కామెంట్లు చేస్తున్నారు.

వాల్తేరు వీరయ్య రిలీజ్ డేట్ విషయంలో చిరంజీవి స్ట్రాటజీ వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సాంగ్ కు మంచి రెస్పాన్స్ రాగా రవితేజ కూడా ఈ సినిమాలో నటిస్తున్నా చిరంజీవి సినిమాగానే ఈ సినిమాకు ప్రమోషన్స్ జరుగుతున్నాయి. 100 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులను సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది.

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus