Tholi Prema: తొలిప్రేమ రీ రిలీజ్ పై మెగా అభిమానుల ఆగ్రహానికి అసలు కారణమిదే!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినీ కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు ఉండగా ఆ సినిమాలలో తొలిప్రేమ కూడా ఒకటనే సంగతి తెలిసిందే. మాతా క్రియేషన్స్ సంస్థ వాళ్లు తొలిప్రేమ సినిమాను జూన్ నెల 30వ తేదీన రీ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తుండటం గమనార్హం. అయితే ఈ సినిమాను రీ రిలీజ్ చేయడంపై మెగా అభిమానుల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతూ ఉండటం సోషల్ మీడియలో హాట్ టాపిక్ అవుతోంది.

సమయం, సందర్భం లేకుండా తొలిప్రేమ (Tholi Prema) సినిమాను రీ రిలీజ్ చేయాలని భావించడం సరైన నిర్ణయం అనిపించుకోదని మెగా అభిమానులు వెల్లడిస్తున్నారు. వ్యక్తిగత లాభాల కోసం సినిమాలను రీ రిలీజ్ చేయాలని భావిస్తే మాత్రం తమ నుండి ఎలాంటి సపోర్ట్ ఉండదని ఫ్యాన్స్ వెల్లడిస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలను ఎక్కువగా రీ రిలీజ్ చేస్తున్నారు.

రీ రిలీజ్ లో కొన్ని సినిమాలు అంచనాలకు మించి కలెక్షన్లను రాబడుతుండగా మరికొన్ని సినిమాలు మాత్రం భారీ స్థాయిలో కలెక్షన్లను సాధించడంలో తడబడుతున్నాయి. పవన్ కళ్యాణ్, సాయితేజ్ కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన బ్రో మూవీ జులై నెల 28వ తేదీన థియేటర్లలో విడుదల కానుందనే సంగతి తెలిసిందే. బ్రో మూవీ రిలీజ్ కు నాలుగు వారాల ముందు తొలిప్రేమను రీ రిలీజ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు.

ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో గుడుంబా శంకర్ మూవీ రీ రిలీజ్ కానుంది. మరికొన్ని మెగా హీరోల సినిమాలు కూడా థియేటర్లలో రీ రిలీజ్ కానున్నాయని సమాచారం అందుతోంది. తొలిప్రేమ సినిమాను రీ రిలీజ్ చేసినా తమ నుంచి ఎలాంటి హడావిడి ఉండదని ఫ్యాన్స్ నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ సినిమా ఈ ఏడాది డిసెంబర్ లో రిలీజ్ కానుంది. పవన్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాలపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.

బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!

అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus