ఆర్ఆర్ఆర్ మూవీ బాక్సాఫీస్ వద్ద అంచనాలను మించి సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే. బాహుబలి2 స్థాయిలో యునానిమస్ పాజిటివ్ టాక్ రాకపోయినా ఆర్ఆర్ఆర్ సినిమాకు పాజిటివ్ రివ్యూలు రావడం, ఆర్ఆర్ఆర్ కు గట్టి పోటీని ఇచ్చే సినిమా లేకపోవడం ఈ సినిమాకు ప్లస్ అయింది. ఈ ఇండస్ట్రీ ఆ ఇండస్ట్రీ అనే తేడాల్లేకుండా ఆర్ఆర్ఆర్ మూవీ సత్తా చాటుతోంది. గురువారం నాటికి పలు ఏరియాల్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఆర్ఆర్ఆర్ మూవీ ఫుల్ రన్ లో ఈ సినిమాను కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లకు అంచనాలకు మించి లాభాలను అందించడం గ్యారంటీ అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ప్రభాస్ కు పాన్ ఇండియా హీరోగా బాలీవుడ్ లో గుర్తింపు ఉండగా ఆర్ఆర్ఆర్ సక్సెస్ తో చరణ్, తారక్ లకు పాన్ ఇండియా హీరోలుగా గుర్తింపు దక్కింది. చరణ్, తారక్ నటనకు బాలీవుడ్ ప్రేక్షకులతో పాటు సినీ అభిమానులు సైతం ఫిదా అవుతున్నారు.
అయితే ఆర్ఆర్ఆర్ సక్సెస్ ఆచార్యకు కలిసొస్తుందా? అనే చర్చ ఇండస్ట్రీలో జోరుగా జరుగుతోంది. ఆచార్య సినిమాలో చరణ్ ఫుల్ లెంగ్త్ రోల్ లో నటించకపోవడం మెగా ఫ్యాన్స్ టెన్షన్ కు కారణమవుతోంది. ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్ ఫుల్ లెంగ్త్ రోల్ సినిమాతో బాలీవుడ్ లో అదృష్టాన్ని పరీక్షించుకుంటే బాగుండేదని అభిమానులు భావిస్తున్నారు. అయితే ఆచార్యకు ఆర్ఆర్ఆర్ సక్సెస్ బిజినెస్ పరంగా కలిసొస్తుందని చెప్పవచ్చు. ఒకవేళ ఆచార్య సినిమా కూడా బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధిస్తే మాత్రం చరణ్ కు క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ మరింత పెరుగుతుంది.
ఆర్ఆర్ఆర్ విడుదలయ్యే వరకు ఆచార్య రిలీజ్ కాకూడదనే షరతు వల్లే ఈ సినిమా రిలీజ్ ఆలస్యమైందని బోగట్టా. ఆచార్య విడుదలకు ముందు చరణ్ బాలీవుడ్ లో భారీస్థాయిలో ప్రమోషన్స్ చేయనున్నారని తెలుస్తోంది. చరణ్ కు జోడీగా ఈ సినిమాలో పూజా హెగ్డే నటించారు. ఆచార్య విషయంలో చరణ్ నిర్ణయం రైటో రాంగో తెలియాలంటే సినిమా రిలీజయ్యే వరకు ఆగాల్సిందే.
Most Recommended Video
‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?