Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ఆ ప్రాజెక్ట్ లను ప్రకటిస్తారా?

మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య, గాడ్ ఫాదర్ సినిమాలు ఆశించిన ఫలితాలను అందుకోకపోవడంతో కొన్ని నెలల క్రితం వరకు ఆయన కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించలేదు. అయితే వాల్తేరు వీరయ్య రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుని చిరంజీవి పేరు మళ్లీ బాక్సాఫీస్ వద్ద మారుమ్రోగింది. భోళా శంకర్ సినిమాతో చిరంజీవి మరో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంటారని అభిమానులు నమ్మకంతో ఉన్నారు. అయితే చిరంజీవి మాత్రం కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించడం లేదు.

చిరంజీవి కెరీర్ పరంగా గ్యాప్ తీసుకోవడం ఫ్యాన్స్ కు ఏ మాత్రం ఇష్టం లేదు. ప్రముఖ డైరెక్టర్ల డైరెక్షన్ లో చిరంజీవి నటిస్తారని వార్తలు వినిపిస్తుండగా ఈ వార్తల్లో నిజానిజాలు తెలియాలంటే మాత్రం అధికారిక ప్రకటన రావాల్సింది. మరోవైపు చిరంజీవి రెమ్యునరేషన్ 100 కోట్ల రూపాయలకు చేరింది. చిరంజీవి సినిమాలు ఇతర భాషల్లో విడుదలవుతున్నాయి. హిందీ ప్రేక్షకులలో తనకు ప్రత్యేక గుర్తింపు ఉండటంతో హిందీ ఆడియన్స్ కూడా చిరు సినిమాలపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు.

చిరంజీవి పాన్ ఇండియా డైరెక్టర్ల డైరెక్షన్ లో నటించాలని ఫ్యాన్స్ కోరుకుంటుండగా ఫ్యాన్స్ కోరికను చిరంజీవి తీరుస్తారేమో చూడాలి. రాజమౌళి, ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో చిరంజీవి ఫుల్ లెంగ్త్ రోల్ లో నటిస్తే బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. సినిమా సినిమాకు చిరంజీవి రేంజ్ పెరుగుతుండగా మెగాస్టార్ యంగ్ జనరేషన్ డైరెక్టర్లకు మాత్రం బెస్ట్ ఆప్షన్ గా నిలిచారు. యంగ్ డైరెక్టర్లు చిరంజీవితో ఒక్క సినిమా తీసి విజయం సాధించినా తమ జాతకం మారుతుందని భావిస్తున్నారు.

చిరంజీవి మాస్ మసాలా సినిమాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. చిరంజీవి నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లకు ప్రాధాన్యత ఇస్తున్నారని సమాచారం. తన సినిమాలు అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా చిరంజీవి కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు.



అమిగోస్ సినిమా రివ్యూ & రేటింగ్!
పాప్ కార్న్ సినిమా రివ్యూ & రేటింగ్!

వేద సినిమా రివ్యూ & రేటింగ్!
యూ.ఎస్ లో టాప్ గ్రాసర్స్ గా నిలిచిన 10 టాలీవుడ్ సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus