RRR Movie: ఆ సీన్స్ రిలీజ్ చేస్తే యూట్యూబ్ షేక్ కావడం పక్కా.. ఏమైందంటే?

2022 సంవత్సరంలో బిగ్గెస్ట్ హిట్ ఏదనే ప్రశ్నకు ఆర్ఆర్ఆర్ మూవీ అని సమాధానం చెప్పడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. చరణ్ (Ram Charan) , తారక్ (Jr NTR) కలిసి నటించిన ఈ సినిమా ఆయా హీరోల కెరీర్ లో స్పెషల్ మూవీగా నిలిచింది. రాజమౌళి (S. S. Rajamouli) డాక్యుమెంటరీ తాజాగా నెట్ ఫ్లిక్స్ లో విడుదల కాగా జక్కన్న అభిమానులు ఈ డాక్యుమెంటరీని చూడటానికి తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ డాక్యుమెంటరీ ద్వారా జక్కన్నకు సంబంధించిన కీలక విషయాలు వెల్లడవుతున్నాయి.

ఈ డాక్యుమెంటరీలో ఆర్ఆర్ఆర్ (RRR) డీలీటెడ్ సీన్ కు సంబంధించిన కొన్ని షాట్స్ ను పొందుపరిచారు. ఆర్ఆర్ఆర్ కు సంబంధించిన ఒక చిన్న క్లిప్ సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుండగా ఆర్ఆర్ఆర్ డీలీటెడ్ సీన్స్ రిలీజ్ చేస్తే యూట్యూబ్ షేక్ కావడం పక్కా అని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం. మరి జక్కన్న లేదా ఆర్ఆర్ఆర్ నిర్మాతలు ఈ దిశగా అడుగులు వేస్తారేమో చూడాల్సి ఉంది.

గతంలో కొన్ని సినిమాలకు సంబంధించి డిలీటెడ్ సీన్లు యూట్యూబ్ లో విడుదలై మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకోవడం జరిగింది. మరోవైపు ఆర్ఆర్ఆర్ సినిమా సీక్వెల్ కోసం ప్రేక్షకులు ఒకింత ఆసక్తిగా ఎదురుచూస్తుండగా ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ ఎప్పుడు వస్తాయో చూడాల్సి ఉంది. ఆర్ఆర్ఆర్ సీక్వెల్ గురించి రాబోయే రోజుల్లో జక్కన్న ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.

ఆర్ఆర్ఆర్ సీక్వెల్ కోసం ఇతర భాషల ప్రేక్షకులు సైతం ఒకింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆర్ఆర్ఆర్ డిలీటెడ్ సీన్లకు సంబంధించి ఏదైనా అప్ డేట్ వస్తుందేమో చూడాల్సి ఉంది. రాజమౌళి తర్వాత ప్రాజెక్ట్ లకు ఒకింత భారీ స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తోంది. మహేష్ పుట్టినరోజుకు నాలుగు రోజుల సమయం మాత్రమే ఉండగా మహేష్ పుట్టినరోజున కొత్త సినిమాకు సంబంధించి ఎలాంటి అప్ డేట్స్ వస్తాయో చూడాల్సి ఉంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus