మెగా అభిమానులకు ఈ దీపావళి పండుగ నూతన ఉత్సాహాన్నిచ్చింది. తమ అభిమాన హీరోల ఫస్ట్ లుక్ లతో పండుగ కొత్త కళను సంతరించుకుంది. మెగాస్టార్ చిరంజీవి శనివారం మధ్యాహ్నమే అదిరిపోయే స్టిల్స్ తో ఎంట్రీ ఇచ్చి సోషల్ మీడియాకు పరుగులు నేర్పిస్తే, సాయంత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాటమరాయుడు గా పలకరించి ఫ్యాన్స్ కళ్లల్లో వెలుగులు నింపారు.
పవన్ కళ్యాణ్, హీరోయిన్ శృతిహాసన్ తో కలిసి దీపాలు వెలిగిస్తున్న మోషన్ పోస్టర్ ఫెస్టివల్ లుక్ ని తీసుకొచ్చింది. ఈ లుక్ ఖుషీలో పవన్, భూమిక పరిచయమయ్యే సన్నివేశాన్ని గుర్తు చేసింది. ఈ పోస్టర్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. డాలీ డైరక్షన్లో రూపుదిద్దుకున్న ఈ మూవీలో పవన్ ఫ్యాక్షన్ లీడర్ గా నటిస్తున్నారు. ఉగాది పండుగను పురస్కరించుకొని మార్చి 29 న కాటమరాయుడును రిలీజ్ చేసేందుకు చిత్ర బృందం శ్రమిస్తోంది.