Balakrishna: బాలయ్య సినిమాలో ఆ హీరో నటిస్తున్నారా?

  • August 17, 2021 / 03:21 PM IST

స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ నటిస్తున్న అఖండ షూటింగ్ దాదాపుగా పూర్తైంది. అక్టోబర్ 8వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుందని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ మేరకు సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఆర్ఆర్ఆర్ మూవీ కచ్చితంగా వాయిదా పడే అవకాశాలు ఉన్న నేపథ్యంలో దసరా పండుగ కానుకగా తమ సినిమాలను రిలీజ్ చేయాలని పలువురు స్టార్ హీరోలు ప్లాన్ చేసుకుంటున్నారు.

బాలయ్య తరువాత సినిమా గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో తెరకెక్కనుండగా ఈ సినిమాతో పాటు బాలయ్య అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తెరకెక్కే సినిమాలో కూడా కనిపిస్తారని తెలుస్తోంది. బాలయ్య అనిల్ రావిపూడి కాంబో మూవీలో గెస్ట్ రోల్ ఉందని ఆ సినిమాలో అతిథి పాత్రలో సాయితేజ్ కనిపించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. సాయిధరమ్ తేజ్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో సుప్రీమ్ సినిమా తెరకెక్కింది. బాక్సాఫీస్ వద్ద సుప్రీమ్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే.

అనిల్ రావిపూడి అడిగితే సాయిధరమ్ తేజ్ నో చెప్పే అవకాశం అయితే లేదు. మరి సాయిధరమ్ తేజ్ నిజంగా అతిథి పాత్రలో నటిస్తారో లేదో తెలియాలంటే మరికొన్ని నెలలు ఆగాల్సిందే. అనిల్ రావిపూడి అపజయం ఎరుగని దర్శకులలో ఒకరు కావడంతో ఈ ప్రాజెక్ట్ కోసం బాలయ్య ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అనిల్ రావిపూడి ప్రస్తుతం ఎఫ్3 సినిమాతో బిజీగా ఉన్నారు.

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus