మెగాస్టార్ చిరంజీవి పరిశ్రమకు ఒంటరిగా వచ్చినా ఒక సైన్యంలా తయారయ్యారు. అతని ప్రోత్సాహంతో ఏడుమంది హీరోలు సిద్ధమయ్యారు. వారందరూ సినిమాలతో బిజీగా ఉన్నారు. మెగా హీరోల సినిమాలు వచ్చే ఏడాది నెలకొకటి చొప్పున రిలీజ్ కానుంది. ఆ చిత్రాల బిజినెస్ అంచనా వేస్తే ఆశ్చర్యం కలిగిస్తోంది. చిరంజీవి తొలి స్వాతంత్ర సమరయోధుడిగా నటిస్తున్న సైరా నరసింహా రెడ్డి మూవీ 180 కోట్లతో తెరకెక్కుతోంది. ఇది 300 కోట్ల మేర బిజినెస్ చేయనుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ దర్శకత్వంలో అజ్ఞాతవాసి 100 కోట్ల బిజినెస్ చేసిందని టాక్.
శాటిలైట్.. డిజిటల్ వంటి ఇతర హక్కులను కలుపుకుంటే 150 కోట్లు దాటుతుందని అంచనా. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ సుకుమార్ దర్శకత్వంలో “రంగస్థలం 1985 ” చేస్తున్నారు. ఈ మూవీ థియేట్రికల్ రైట్స్ రూపంలో 80 కోట్ల బిజినెస్ జరిగిందని అంటున్నారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సోల్జర్ గా నటిస్తున్న “నా పేరు సూర్య” 80 కోట్లకు పైగానే ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందని తెలిసింది. సాయి ధరమ్ తేజ్- వినాయక్ కాంబినేషన్ లో రూపొందుతున్న మూవీ బిజినెస్ 30 కోట్లుగా తేల్చారు. వరుణ్ తేజ్ నటిస్తున్న తొలి ప్రేమ మూవీ 20 కోట్ల వ్యాపారం చేసిందట. అల్లు శిరీష్ మూవీ ఒక్క క్షణంకు 15 కోట్ల వ్యాపారం జరిగిందని తెలుస్తోంది. ఈ విధంగా మెగా హీరోల సినిమాల ప్రీ రిలీజ్ బిజినెస్ 600 కోట్లను దాటిపోయింది. ఇక కలక్షన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో.. దీనిని బట్టి అర్ధం చేసుకోవచ్చు.