Dil Raju: తెలుగు రాష్ట్రాల థియేటర్ల విషయంలో అలా జరుగుతోందా?

రెండు తెలుగు రాష్ట్రాల్లోని క్రేజ్ ఉన్న థియేటర్లలో వారసుడు సినిమాకు ఎక్కువ సంఖ్యలో థియేటర్లు దక్కాయని తెలిసి అభిమానులు ఫీలవుతున్న సంగతి తెలిసిందే. చిరంజీవి, బాలయ్య సినిమాలకు మెయిన్ థియేటర్లు దక్కడం లేదని ఫ్యాన్స్ తెగ ఫీలవుతున్నారు. తమ హీరోల సినిమాలకు పాజిటివ్ టాక్ వచ్చినా భారీ స్థాయిలో కలెక్షన్లు వస్తాయా? అనే సందేహాన్ని వాళ్లు వ్యక్తం చేస్తుండటం గమనార్హం.
అయితే దిల్ రాజు వల్ల మెగా నందమూరి ఫ్యాన్స్ మాత్రం కలిసిపోయారు.

రెండు సినిమాలకు బెనిఫిట్ కలిగేలా ఫ్యాన్స్ సహకరించుకుంటూ ముందుకెళుతున్నారు. రెండు సినిమాలకు పాజిటివ్ టాక్ రావాలని రెండు సినిమాలు రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇద్దరు హీరోల అభిమానులను కలిపిన ఘనత దిల్ రాజుకే దక్కుతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. వారసుడు సినిమా టాక్ ను బట్టి ఈ సినిమాను చూడాలో వద్దో డిసైడ్ అవుతామని ఫ్యాన్స్ చెబుతున్నారు. వారసుడు సినిమా తెలుగు రాష్ట్రాల హక్కులు 9 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయని తెలుస్తోంది.

అయితే దిల్ రాజు మాత్రం తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా భారీ స్థాయిలో లాభాలను అందిస్తుందని భావిస్తున్నారని సమాచారం అందుతోంది. వారసుడు ట్రైలర్ పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. ఇప్పటికే చూసిన పలు తెలుగు సినిమాలను పోలి ఈ సినిమా ఉందని ఈ మూవీ రొటీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని కామెంట్లు వినిపిస్తున్నాయి. వారసుడు సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ హిట్ గా నిలుస్తుందో చూడాల్సి ఉంది.

ఈ సినిమా కోలీవుడ్ రైట్స్ మాత్రం భారీ మొత్తానికి అమ్ముడయ్యాయని తెలుస్తోంది. తమిళనాడులో 400 స్క్రీన్లలో ఈ సినిమా రిలీజవుతోంది. విజయ్ మాత్రం ఈ సినిమాతో తన క్రేజ్ మరింత పెరుగుతుందని భావిస్తున్నారు. బీస్ట్ విషయంలో జరిగిన పొరపాటు ఈ సినిమా విషయంలో జరగదని ఆయన నమ్ముతున్నారు.

బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!

ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus