గతేడాది ‘రంగస్థలం’ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్టందుకున్న మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన తాజా చిత్రం ‘వినయ విధేయ రామా’ ఈ సంక్రాంతికి విడుదలై ప్లాప్ గా నిలిచింది. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను డైరెక్షన్లో ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం మొదటి షో నుండే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. బోయపాటి హీరోని.. విలన్ ని ఎలివేటే చేసిన తీరు చాలా ఓవర్ అయ్యిందనే కామెంట్స్ వచ్చాయి. ఇంతకముందు చరణ్ నటించిన చిత్రాలకి మరీ ఇంత ఘోరమైన టాక్ రాలేదనే చెప్పాలి.
ఇదిలా ఉండగా.. ఎంత నెగిటివ్ టాక్ వచ్చినా… రాంచరణ్ – బోయపాటి కి ఉన్న మాస్ ఫాలోయింగ్, సంక్రాంతి పండుగ సీజన్ కారణంగా మంచి కలెక్షన్లను రాబట్టింది. దాదాపు 60 కోట్ల షేర్ ను ఈ చిత్రం రాబట్టింది. అయితే ఈ చిత్రానికి 90 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరగడంతో నష్టాలు తప్పలేదు. ఈ క్రమంలో రాంచరణ్ ఈ నష్టాలకి బాధ్యతగా నిలబడుతునాడు. ఇందులో భాగంగా ఈ చిత్రానికి గానూ చరణ్ తీసుకున్న రెమ్యూనరేషన్ ను తిరిగి వెనక్కి ఇచ్చేయడమే కాకుండా… ‘కొణిదెల ప్రొడక్షన్స్’ పై తన తండ్రితో నిర్మిస్తున్న “సైరా నరసింహా రెడ్డి” సినిమా హక్కులను ‘వినయ విధేయ రామా’ చిత్రంతో నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లకు.. నష్టపరిహారంగా ఇచ్చేందుకు సిద్ధమయ్యాడట. గతంలో చాలా సార్లు పవన్ కళ్యాణ్ కూడా తన సినిమాతో నష్టపోయిన నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు.. ఇలానే అండగా నిలబడేవారు. ఇప్పుడు చరణ్ కూడా తన బాబాయ్ పవన్ కళ్యాణ్ బాటలోనే నడుస్తున్నాడంటూ ఫిలింనగర్ విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు.