Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటో షూట్ పిక్స్ వైరల్..!

ఆగష్ట్ 22న మెగా అభిమానులకు పెద్ద పండుగ రోజు.ఎందుకంటే ఆ రోజు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు కాబట్టి..! అయితే 10 రోజుల ముందే మెగా అభిమానులను సర్ప్రైజ్ చేశారు చిరు. తాజాగా ఆయన కొత్త ఫోటో షూట్లో పాల్గొన్నారు. ఇది ఏ మూవీకి సబంధించినదో తెలీదు కానీ.. ఈ ఫోటోలు చూసిన వారు మాత్రం తెగ షేర్ లు చేస్తున్నారు. మరికొంతమంది లైకులు వర్షం కురిపిస్తున్నారు. ‘ఈయన వయసు 65 కాదు 30 మాత్రమే’ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

నిజంగానే ఈ ఫొటోల్లో చిరు యువకుడిలా కనిపిస్తున్నారు. మేకోవర్ కూడా బాగుంది. జుట్టు చూస్తుంటే ఈ మధ్యనే కొంచెం ట్రీట్మెంట్ తీసుకున్నట్టు స్పష్టమవుతుంది. కానీ చిరుకి అది బానే సెట్ అయ్యింది.ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్లో చేస్తున్న ‘ఆచార్య’ షూటింగ్ పూర్తయ్యింది కానీ.. రెండు పాటలు పెండింగ్ ఉన్నాయి. అటు తర్వాత మోహన్ రాజా దర్శకత్వంలో ‘లూసీఫర్’ రీమేక్ లో నటించడానికి కూడా రెడీ అవుతున్నారు మెగాస్టార్.

వీటితో పాటు మెహర్ రమేష్ డైరెక్షన్లో ‘వేదాలం’ రీమేక్, బాబీ డైరెక్షన్లో ఓ మూవీ చేయడానికి కూడా మెగాస్టార్ రెడీ అవుతున్నారు. మరోపక్క ప్రభుదేవా డైరెక్షన్లో కూడా ఓ చిత్రం చేయడానికి రెడీ అవుతున్నట్టు కొద్దిరోజుల నుండీ ప్రచారం జరుగుతుంది. అలాగే మారుతీ దర్శకత్వంలో కూడా సినిమా చేయడానికి మెగాస్టార్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు తెలుస్తుంది. ఏమైనా వరుస ప్రాజెక్టులతో మెగాస్టార్ స్టార్ హీరోలను మించి దూకుడు ప్రదర్శిస్తున్నట్టు స్పష్టమవుతుంది.

1

2

3

4

5

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus