ప్రిన్స్ మహేష్ అతడు సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, నాజర్ ను చూపిస్తూ బ్రహ్మానందం చెప్పే డైలాగ్ అదే అండీ ‘మూసలోడే కానీ మహాను బావుడు’. అయితే ఈ డైలాగ్ కి ఇప్పుడు మనం చదవబోతున్న కధకి పెద్ద సంభందం లేదు కానీ, అదే ప్రాసలో ఇప్పుడు మనం మెగాస్టార్ గురించి మాట్లాడుకుంటే…మెగాస్టారే కానీ మొండి వాడు అని అనవచ్చు? అదేంటి మెగాస్టార్ మొండి వాడు ఏంటి? ఏమయ్యింది? అసలు మెగాస్టార్ ను మొండి వాడిగా ఎందుకు అంటున్నారు అన్న మ్యాటర్ తెలియాలంటే ఒకసారి ఈ విషయం చదవండి. మెగాస్టార్ తన 150 సినిమాతో ఎలాగో ఉనికి నిలుపుకున్నాడు. అదే క్రమంలో ఇప్పుదు 151వ సినిమాతో ఉనికి చాటుకోవాలనే తాపత్రయంతో చాలా రిస్క్ చేస్తున్నాడు. ఏకంగా బాహుబలి సినిమాతో తాను చేస్తున్న 151వ సినిమా ఉయ్యాల వాడ నరసింహరెడ్డి సినిమాను ఊహించుకుంటూ హడావిడి చేస్తున్నాడు. అసలు చిరు ఏం చేస్తున్నాడు అని వివరాల్లోకి వెళితే, చిరంజీవి తన 151వ సినిమాగా స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత గాథను తెరకెక్కిస్తున్నారనే విషయం మనకు తెలిసిందే.
ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుపుకుంటుంది. అయితే మొదట ఈ మూవీని సాధారణంగా తెరకెక్కించాలని నిర్ణయించారు. విజువల్ ఎఫెక్ట్స్ కి ప్రాధాన్యం లేకుండా కథపైనే ఎక్కువుగా ఫోకస్ పెట్టారు. కానీ ఇప్పడు కథతో పాటు విజువల్ ఎఫెక్ట్స్ కి ప్రాధాన్యతని ఇచ్చారు. దీంతో బడ్జెట్ తారాస్థాయికి చేరుకుంది. ఇదంతా బాహుబలి2 సాధించిన విజయాన్ని చూసిన తరువాత బడ్జెట్ ని పెంచేస్తున్నారు. ఈ మూవీని రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. రామ్ చరణ్ లెక్కల ప్రకారం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి మూవీని 100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించాలని నిర్ణయించారు. కానీ మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు దీన్ని 130 కోట్ల రూపాయలకి బడ్జెట్ కి ఫిక్స్ చేశారంట. ఈ విషయంలో రామ్ చరణ్ కి కాస్త చెమటలు పడుతున్నా, చిరంజీవి మాత్రం బడ్జెట్ తగ్గేది లేదని అంటున్నారు. చివరకు నాన్నే చేద్దాం అంటే చెర్రీ నో చెప్పలేడుగా, మోత్తగ్మ చూసుకుంటే చిరు కాస్త మొండిగా సముద్రానికి ఎదురు ఈదుతున్నట్లే కనిపిస్తున్నాడు. మరి ఏం జరుగుతుందో చూద్దాం.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.