కూతురికి మెగాస్టార్ కాస్ట్లీ గిఫ్ట్!

మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీలో వరుస సినిమాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కొరటాల శివ రూపొందిస్తోన్న ‘ఆచార్య’ సినిమాలో నటిస్తోన్న ఆయన ఆ తరువాత ‘లూసిఫర్’, ‘వేదాళం’ రీమేక్ లలో నటించనున్నారు. ఇదిలా ఉండగా.. రీసెంట్ గా మెగాస్టార్ జూబ్లీహిల్స్ ప్రాంతంలో 1200 చదరపు గజాల స్ధలాన్ని కొన్నట్లు తెలుస్తోంది. ఈ స్థలం ప్రముఖ ఎమ్మెల్యేలు, ఎంపీలు, సినీ సెలబ్రెటీలు నివసిస్తున్న ప్రాంతంలో ఉంటుందట. నిజానికి చిరుకి, రామ్ చరణ్ కి ఇదే ఏరియాలో చాలా ప్రాపర్టీలు ఉన్నాయి.

కానీ తన కూతురి కోసం కొత్తగా స్థలాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది. చిరుకి తన పిల్లలకి ఖరీదైన బహుమతులు ఇవ్వడం అలవాటు. ఈ క్రమంలో తన చిన్న కూతురు శ్రీజ కోసం ఓ అందమైన భవంతిని గిఫ్ట్ గా ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు చిరు. దీంతో శ్రీజ పేరుతో ఒక స్థలాన్ని రిజిస్టర్ చేయించారు. ఈ స్థలం విలువ పాతిక కోట్లకి పైగా ఉంటుందని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ స్థలంలో భవంతి నిర్మాణం జరుగుతోందట. దీనికోసం మరో రూ.5 కోట్లు అదనంగా ఖర్చు చేయబోతున్నారు.

ఈ విధంగా తన కూతురిపై ఉన్న ప్రేమని తెలియజేస్తున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే.. చిరు నటిస్తోన్న ‘ఆచార్య’ సినిమాను వీలైనంత త్వరగా చిత్రీకరించి వేసవిలో సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. దీనికోసం చిరు రూ.50 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారని సమాచారం. తన తదుపరి సినిమాకి కూడా ఇదే రేంజ్ లో అందుకోబోతున్నారని చెబుతున్నారు.

Most Recommended Video

బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus