Chiranjeevi: అమ్మని చూసి ఆ విషయం నేర్చుకున్నాను… చిరంజీవి పోస్ట్ వైరల్!

తెలుగు చిత్ర పరిశ్రమలో నటుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నటుడు చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో ఇప్పటికి స్టార్ హీరోగా ఓ వెలుగు వెలుగుతున్నటువంటి చిరంజీవి ఎందరికో స్ఫూర్తి అని చెప్పాలి. ఇండస్ట్రీలో ఎలాంటి సపోర్ట్ లేకుండా ఈ స్థాయిలో నిలిచిన చిరంజీవి ఎంతోమంది హీరోలకు స్ఫూర్తిగా నిలిచి వారు కూడా ఇండస్ట్రీలోకి రావడానికి కారణమయ్యారు. ఇలా సినిమాల పరంగా ఎంతో బిజీగా ఉండే చిరంజీవి సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు.

ఈ క్రమంలోనే ఏ చిన్న విషయాన్ని అయినా ఈయన సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటారు. ఈ క్రమంలోనే తన తమ్ముడు నాగబాబు అలాగే తన సోదరీమణులతో కలిసి ఈయన తన తల్లితో దిగిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ తన తల్లి గురించి ఎంతో గొప్పగా చెప్పడమే కాకుండా ప్రపంచంలోనే తల్లులందరికీ కూడా ఈయన మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. నేడు మదర్స్ డే కావడంతో ఎంతో మంది సెలబ్రిటీలు వారికి వారి అమ్మలతో ఉన్నటువంటి అనుబంధం గురించి చెబుతూ ఎమోషనల్ అవుతున్నారు.

ఈ క్రమంలోనే చిరంజీవి (Chiranjeevi) సైతం తన తోడబుట్టిన వారితో తన తల్లితో కలిసి దిగిన ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ చేసిన ఎమోషనల్ ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈ సందర్భంగా చిరంజీవి స్పందిస్తూ అనురాగం మమకారం ఈ రెండింటి అర్థమే అమ్మ. అమ్మ నవ్వు చూస్తే అన్ని మర్చిపోతాము, నిడారంబరంగా ఉండటం మేము అమ్మని చూసి నేర్చుకున్నాం.

అమ్మలందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు అంటూ ఈ సందర్భంగా చిరంజీవి మాతృ దినోత్సవ శుభాకాంక్షలు చెబుతూ చేసినటువంటి ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక చిరంజీవి సినిమాల విషయానికి వస్తే వాల్తేరు వీరయ్య సినిమా ద్వారా ప్రేక్షకులు ముందుకు వచ్చిన చిరంజీవి ప్రస్తుతం భోళా శంకర్ సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు.

కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus