మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా డైరెక్షన్ లో తెరకెక్కిన గాడ్ ఫాదర్ మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంటూ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. చిరంజీవి నటనకు ప్రేక్షకుల నుంచి ఊహించని స్థాయిలో ప్రశంసలు దక్కడంతో పాటు గాడ్ ఫాదర్ కథలో చాలా మార్పులు చేయడంతో లూసిఫర్ సినిమాను చూసిన ప్రేక్షకులకు సైతం గాడ్ ఫాదర్ సినిమా ఎంతగానో నచ్చింది. గాడ్ ఫాదర్ సినిమాను ప్రదర్శించిన థియేటర్లు ప్రేక్షకులతో కళకళలాడుతున్నాయి.
గాడ్ ఫాదర్ సినిమాకు టికెట్లు దొరకకపోతే మాత్రమే ప్రేక్షకులు దసరాకు విడుదలైన ఇతర సినిమాలపై దృష్టి పెడుతున్నారు. అయితే చిరంజీవి మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో బిస్లెరీ బాటిల్స్ ను గాడ్ ఫాదర్ బొమ్మతో ప్రచారం చేస్తున్నారు. సూపర్ గుడ్ ఫిల్మ్స్ తో బిస్లెరీ సంస్థ ఒప్పందం కుదుర్చుకోవడంతో వాటర్ బాటిళ్లపై గాడ్ ఫాదర్ బొమ్మ ఉన్న లేబుళ్లు మార్కెట్ లో ప్రత్యక్షమయ్యాయి. సూపర్ గుడ్ ఫిల్మ్స్ గాడ్ ఫాదర్ సినిమాను కొత్త తరహాలో ప్రచారం చేస్తుండటం
అభిమానులకు సైతం ఎంతగానో సంతోషాన్ని కలిగిస్తోంది. గాడ్ ఫాదర్ సినిమా రెండో రోజు 31 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకోవడం గమనార్హం. ఈ సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించిన్ సత్యదేవ్ నటనకు సైతం ప్రేక్షకుల నుంచి మంచి మార్కులు పడుతున్నాయి. చిరంజీవి చెల్లి పాత్రలో నటించిన నయనతార తన నటనతో మెప్పించారు. శని, ఆదివారాలలో గాడ్ ఫాదర్ కలెక్షన్లు మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉంది.
గాడ్ ఫాదర్ సక్సెస్ తో చిరంజీవి తర్వాత సినిమాలపై కూడా మంచి అంచనాలు ఏర్పడగా ఆ సినిమాలు ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాయో చూడాలి. మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీలో మాస్ కథాంశాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుండటం గమనార్హం. మెగాస్టార్ చిరంజీవి గ్రేట్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.