Chiranjeevi, Ravi Teja: నా తమ్ముడు రవితేజకు జన్మదిన శుభాకాంక్షలు అంటూ స్పెషల్ విషెస్ చెప్పిన చిరు!

తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా సొంత టాలెంట్ తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అంచలంచలుగా ఇండస్ట్రీలో ఎదిగిన వారిలో మెగాస్టార్ చిరంజీవి ఒకరు. అయితే ఈయనని స్ఫూర్తిగా తీసుకొని ఎంతోమంది ఇండస్ట్రీలోకి వచ్చి సక్సెస్ సాధించారని చెప్పాలి. ఇలా చిరంజీవి స్ఫూర్తితో ఇండస్ట్రీలోకి వచ్చిన వారిలో మాస్ మహారాజ రవితేజ ఒకరు. ఇలా రవితేజ ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ ప్రస్తుతం ఇండస్ట్రీలోనే స్టార్ హీరోగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.

వరుస సినిమాలతో ప్రేక్షకులను తనదైన శైలిలో సందడి చేస్తున్న రవితేజ తాజాగా ధమాకా వంటి బ్లాక్ బస్టర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.అలాగే కొత్త ఏడాదిలో చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలో ఈయన కీలక పాత్రలో నటించి ఈ సినిమా ద్వారా కూడా మంచి విజయాన్ని అందుకున్నారు. ఇక సినిమాల పరంగా కాకుండా వ్యక్తిగతంగా కూడా చిరంజీవి రవితేజకు మధ్య ఎంతో మంచి అనుబంధం ఉంది. రవితేజ చిరంజీవి గారిని అన్నయ్య అంటూ ఎంతో ఆప్యాయంగా పిలుస్తారు.

చిరంజీవి కూడా రవితేజను తన సొంత తమ్ముడిలాగే భావిస్తారు. ఈ క్రమంలోనే నేడు (జనవరి 26) రవితేజ పుట్టినరోజు కావడంతో చిరంజీవి సోషల్ మీడియా వేదికగా రవితేజకు స్పెషల్ బర్త్ డే విషెస్ తెలియజేశారు. నా తమ్ముడు రవితేజకు పుట్టినరోజు శుభాకాంక్షలు. హాయిగా ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ నిండు నూరేళ్లు సంతోషంగా ఉండేలా దీవించమని భగవంతున్ని ప్రార్థిస్తున్నాను అంటూ చిరంజీవి రవితేజకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ విధంగా రవితేజను సొంత తమ్ముడు తో పోలుస్తూ ఈయన తన సంతోషాన్ని కోరుకుంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడంతో రవితేజ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఇక నేడు ఈయన పుట్టినరోజు సందర్భంగా రవితేజ నటిస్తున్న రావణాసుర చిత్రం నుంచి అప్డేట్స్ కూడా విడుదల చేశారు.

హంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పఠాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

సౌందర్య టు శృతి హాసన్.. సంక్రాంతికి రెండేసి సినిమాలతో పలకరించిన హీరోయిన్ల లిస్ట్..!
అతి తక్కువ రోజుల్లో వంద కోట్లు కొల్లగొట్టిన 10 తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus