కొరటాల చిరంజీవికి హామీ ఇచ్చారా..?

ఖైదీ నంబర్ 150 సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న వరుస సినిమాలు హిట్టవుతున్న సంగతి తెలిసిందే. అయితే చిరంజీవి సినిమాలలో ఇతర ప్రాజెక్ట్ లతో పోలిస్తే ఆచార్య సినిమాపై ఊహించని స్థాయిలో అంచనాలు పెరిగాయి. చిరు, రామ్ చరణ్ కలిసి నటిస్తున్న సినిమా కావడం, కొరటాల ఇప్పటివరకు దర్శకత్వం వహించిన సినిమాలేవీ ఫ్లాప్ కాకపోవడంతో ఆచార్య సినిమాపై భారీగా అంచనాలు పెరిగాయి. కొరటాల శివ ఈ సినిమా విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటూ సినిమా కోసం అహర్శిశలు శ్రమిస్తున్నారు.

అయితే మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమాకు సంబంధించి ఒక విషయంలో మాత్రం సంతృప్తిగా లేరని తెలుస్తోంది. ఆచార్య సినిమా నిడివి మెగాస్టార్ చిరంజీవిని తెగ కంగారు పెడుతోందని సమాచారం. ఇప్పటికే నిడివి గురించి చిరంజీవి కొరటాల శివతో చర్చించారని కొరటాల టెన్షన్ పడవద్దని హామీ ఇచ్చారని తెలుస్తోంది. సాధారణంగా కొరటాల శివ గత సినిమాలతో పోలిస్తే ఈ సినిమాకు వర్కింగ్ డేస్ ఎక్కువ అన్న సంగతి తెలిసిందే. లెంత్ ఎక్కువగా ఉన్న సినిమాలను జనాలు ఎక్కువగా ఆదరించకపోవడంతో చిరంజీవి ఆచార్య విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.

అయితే కొరటాల శివ భరోసా ఇవ్వడంతో చిరంజీవికి ఆచార్య లెంత్ విషయంలో టెన్షన్ తగ్గినట్టు తెలుస్తోంది. మరోవైపు చరణ్, పూజా హెగ్డే పాత్రలకు సంబంధించిన షూటింగ్ ఇప్పటికే పూర్తైంది. సినిమాలో చరణ్ పాత్ర 40 నిమిషాలు, పూజా హెగ్డే పాత్ర 20 నిమిషాలు ఉంటుందని ప్రచారం జరుగుతుండగా ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది. మే 13వ తేదీన ఆచార్య సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Most Recommended Video

శ్రీకారం సినిమా రివ్యూ & రేటింగ్!
జాతి రత్నాలు సినిమా రివ్యూ & రేటింగ్!
గాలి సంపత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus