Chiranjeevi: మెగాస్టార్.. ఈ మూడు జెట్ స్పీడ్ లొనే..!

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)  గత ఏడాది పెద్దగా సందడి చేయకపోయినా, ఈ ఏడాది మాత్రం ఆయన చాలా బిజీగా కనిపించబోతున్నారు. విశ్వంభరతో (Vishwambhara)  ఒక పక్క భారీ విజువల్ ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అవుతుంటే, మరోవైపు రెండు సినిమాల షెడ్యూల్స్ ఇప్పటికే లైన్‌లో పెట్టారు. ఈ ఏడాది చివరికి మూడు సినిమాల షూటింగ్స్‌ను పూర్తి చేసేలా చిరు ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం మెగాస్టార్ ప్రధానంగా విశ్వంభర షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.

Chiranjeevi

మరో నెల రోజుల్లో ఈ సినిమా షూటింగ్‌ను కంప్లీట్ చేసి, రిలీజ్‌కు రెడీ చేసేలా మేకర్స్ పని చేస్తున్నారు. ఇక లైనప్ లో అనిల్ రావిపూడి  (Anil Ravipudi)  దర్శకత్వంలో ఓ కామెడీ ఎంటర్‌టైనర్ ఉండబోతుంది, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో కూడా మరో మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ లైన్‌లో ఉంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా పక్కా ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైనర్ అవుతుందని నిర్మాత సాహు గారపాటి (Sahu Garapati) ఇప్పటికే హింట్ ఇచ్చేశారు.

ఏప్రిల్ లేదా మేలో షూటింగ్ మొదలుపెట్టి, వచ్చే సంక్రాంతికి విడుదల చేసేలా స్పీడ్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. ఇదే సమయంలో నానితో (Nani)  ఓ సినిమా చేస్తున్న శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela)  కూడా చిరుతో సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నాని ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించనున్నాడు. విశ్వంభర సోషియో ఫాంటసీ కాన్సెప్ట్‌లో వస్తుంటే, అనిల్ రావిపూడి సినిమా పూర్తి ఫన్ రైడ్‌గా ఉండబోతోంది.

ఇక శ్రీకాంత్ ఓదెల మూవీ మాత్రం మాస్ అండ్ యాక్షన్ యాంగిల్‌లో ఉండనుందని సమాచారం. ఇలా చూస్తే ఒక ఏడాది వ్యవదిలొనే చిరు (Chiranjeevi) బ్యాక్ టు బ్యాక్ మూడు సినిమాలతో సందడి చేయనున్నారని అనిపిస్తోంది. అనిల్ శ్రీకాంత్ సినిమాలు వచ్చే ఏడాది లో పెద్దగా గ్యాప్ లేకుండానే జెట్ స్పీడ్ లో ఫినిష్ చేయాలని చూస్తున్నారు. మరి మెగా లైనప్ అనుకున్నట్లే ఫినిష్ అవుతుందో లేదో చూడాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus