చిరుకి కథ చెప్పిన కళ్యాణ్ కృష్ణ.. వర్కౌట్ అయ్యిందా?

మెగాస్టార్ చిరంజీవి గతేడాది 2 సినిమాలు రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఆల్రెడీ ఓ సినిమాని రిలీజ్ చేసి బ్లాక్ బస్టర్ కూడా అందుకున్నారు. మారుతున్న కాలంతో సంబంధం లేని స్టార్ ఇమేజ్ ఆయనది. ఇలా వరుస సినిమాలు చేస్తూ ఎంతో మంది స్టార్ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు మెగాస్టార్. ప్రస్తుతం ఆయన మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘భోళా శంకర్’ అనే సినిమాలో నటిస్తున్నారు.

తమిళంలో అజిత్ నటించిన సూపర్ హిట్ మూవీ ‘వేదలమ్’ కి ఇది రీమేక్ గా తెరకెక్కుతుంది. ఈ సినిమా కనుక హిట్ అయితే చిరు చరిత్ర సృష్టించినట్టే..! ఎందుకంటే మెహర్ రమేష్ కు ఇప్పటివరకు సక్సెస్ లేదు. పైగా 10 ఏళ్ళుగా ఆయనతో సినిమా చేయడానికి ఏ హీరో సాహసించలేదు. సరే ఈ విషయాలను పక్కన పెట్టేస్తే.. చిరు ఇప్పుడు మరో ఇద్దరు దర్శకులకు ఛాన్స్ ఇవ్వబోతున్నారు అని వినికిడి. అందులో ఒకరు త్రినాథ్ రావు నక్కిన.

గతేడాది చివర్లో ‘ధమాకా’ అనే మూవీతో డబుల్ బ్లాక్ బస్టర్ కొట్టారు ఆయన. రొటీన్ కథే.. అయినప్పటికీ రవితేజలోని ఎనర్జీని ఎలా వాడుకుని హిట్ కొట్టొచ్చనేది ‘ధమాకా’ తో చేసి చూపించారు. అయితే స్క్రిప్ట్ తో చిరుని మెప్పించడం అంత ఈజీ ఏమీ కాదు. ఇక మరో దర్శకుడు ఎవరంటే కళ్యాణ్ కృష్ణ కురసాల. ‘సోగ్గాడే చిన్ని నాయన’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన.. ఇతను తర్వాత ‘రారండోయ్ వేడుక చూద్దాం’ ‘బంగార్రాజు’ వంటి హిట్లు అందుకున్నాడు.

రవితేజతో చేసిన ‘నేల టిక్కెట్టు’ ప్లాప్ అయ్యింది. అయితే ఇటీవల కళ్యాణ్… చిరంజీవి అపాయింట్మెంట్ తీసుకుని కథ వినిపించారని సమాచారం. చిరు – కళ్యాణ్ కృష్ణ కుటుంబాల మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. కళ్యాణ్ అన్న కన్నబాబు గతంలో చిరు స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ప్రస్తుతం ఆయన వైసీపీ పార్టీ తరఫున మంత్రిగా కొనసాగుతున్నారు. అయితే స్క్రిప్ట్ తో చిరుని కళ్యాణ్ కృష్ణ మెప్పించగలడా అనేది పెద్ద ప్రశ్న.

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus