Chiranjeevi, Varun Tej: వరుణ్ తేజ్ పై జెలసీతో చిరు ఏం చేశారో తెలుసా..?

మెగా ఫ్యామిలీలో ఏ పండగకైనా, ఫంక్షన్ కైనా అందరూ ఒకచోట చేరతారు. సంక్రాంతి, దీపావళి వంటి పండగలను చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటుంది మెగాఫ్యామిలీ. ఈసారి కూడా అలానే ప్లాన్ చేశారు. అందరూ కలిసి పండగను జరుపుకున్నారు. నిన్న రాత్రి భోగి మంటలు పెట్టుకుని సరదాగా గడిపారు. ఇదిలా ఉండగా.. తాజాగా వరుణ్ తేజ్ ఓ వీడియోను షేర్ చేశారు. అందులో ఓ ఫన్నీ ఇన్సిడెంట్ చోటుచేసుకుంది. మెగాస్టార్ చిరంజీవి దోసెలు వేయడంలో స్పెషలిస్ట్.

దోసలే కాదు ఆయన వంటలు కూడా చాలా బాగా చేస్తారని చెబుతుంటారు. అలా వంటలో చేయితిరిగిన చిరు సంక్రాంతి సందర్భంగా తన ఫ్యామిలీ కోసం దోసెలు వేయాలనుకున్నారు. అయితే ఈసారి చిరుకి వరుణ్ తేజ్ కూడా సాయం చేసినట్లుగా ఉన్నాడు. చిరంజీవితో కలిసి దాదాపు 101 దోసెలు వేసినట్లు ఉన్నారు. ఈ విషయాన్ని చెబుతూ ఓ వీడియోను షేర్ చేశారు వరుణ్ తేజ్. చిరు వేసిన దోస సరిగ్గా రాలేదు.

వరుణ్ తేజ్ వేసిన దోస చాలా బాగా వచ్చింది. దీంతో వరుణ్ తేజ్ దోసను కెలికి- నాశనం చేశారు చిరు. వాడి దోస బాగా వచ్చింది.. నాది రాలేదు.. నాకు కుళ్లొచ్చింది అంటూ ఫన్నీగా చెప్పారు. ఇది దోస కాదు.. ఉప్మా అంటూ వరుణ్ తేజ్ ని ఏడిపించారు. ఇక సినిమాల విషయానికొస్తే.. వరుణ్ తేజ్ నటించిన ‘గని’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. మరో పక్క చిరు ‘ఆచార్య’ సినిమాతో ప్రేక్షకులను అలరించబోతున్నారు. అలానే మరో నాలుగైదు సినిమాలను లైన్ లో పెట్టారు. ‘గాడ్ ఫాదర్’, ‘భోళా శంకర్’ లాంటి క్రేజీ సినిమాల్లో నటిస్తున్నారు.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus