Meher Ramesh: అలా చేసి ఉంటే మెహర్ రమేష్ కెరీర్ మరో విధంగా ఉండేదా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెహర్ రమేష్ పేరు ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతూ ఉంటుంది. మెహర్ రమేష్ డైరెక్షన్ లో తెలుగులో తెరకెక్కిన సినిమాలలో బిల్లాను మినహాయిస్తే మిగతా సినిమాలన్నీ నిర్మాతలను ముంచేశాయి. అయితే తన సినిమాలు ఫ్లాప్ అని ఒప్పుకోవడానికి కూడా మెహర్ రమేష్ ఇష్టపడరు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెహర్ రమేష్ చెప్పే మాటలకు సినిమా ఫలితానికి ఏ మాత్రం పొంతన ఉండదు. అయితే ఆంధ్రావాలా, ఒక్కడు సినిమాలను వీర కన్నడిగ, అజయ్ పేర్లతో కన్నడలో రీమేక్ చేసిన మెహర్ రమేష్ అక్కడ మాత్రం అనుకూల ఫలితాలను సొంతం చేసుకున్నారు.

మెహర్ రమేష్ కన్నడ ఇండస్ట్రీకే పరిమితమై ఉంటే మాత్రం అక్కడ స్టార్ డైరెక్టర్ గా కెరీర్ ను కొనసాగించి ఉండేవారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలుగు సినిమాలను కన్నడలో రీమేక్ చేస్తూ మెహర్ రమేష్ కెరీర్ ను కొనసాగించి ఉంటే బాగుండేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నమ్మి ఛాన్స్ ఇచ్చిన స్టార్ హీరోలకు మెహర్ రమేష్ ఇచ్చిన షాకులు మాత్రం మామూలు షాకులు కావు.

మెహర్ రమేష్ హీరోలకు కథ ఎలా చెప్పి ఒప్పిస్తాడో తెలీదు కానీ ఆ కథలతో ప్రేక్షకులను మెప్పించే విషయంలో మాత్రం ఫెయిలవుతున్నారు. తెలుగులో మెహర్ రమేష్ మాత్రం మరో ఛాన్స్ ను సొంతం చేసుకోవడం సులువు కాదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మెహర్ రమేష్ టాప్ డైరెక్టర్ల సహాయసహకారాలు తీసుకుని సినిమాలను తెరకెక్కిస్తే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

మెహర్ రమేష్ తన సినిమాల కథ, కథనం విషయంలో స్పెషల్ ఫోకస్ పెట్టి ఉంటే మరిన్ని విజయాలు గ్యారంటీగా దక్కేవని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మెహర్ రమేష్ రాబోయే రోజుల్లో కెరీర్ ను ఏ విధంగా ప్లాన్ చేసుకోనున్నారో తెలియాల్సి ఉంది. మెహర్ రమేష్ గత సినిమా ఫలితం గురించి ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది.

మిస్టర్ ప్రెగ్నంట్ సినిమా రివ్యూ & రేటింగ్!

ప్రేమ్ కుమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి రజనీకాంత్ సినిమాల థియేట్రికల్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus