Prabhas, Anushka: అనుష్కపై షాకింగ్ కామెంట్స్ చేసిన డైరెక్టర్ మెహర్ రమేష్!

ప్రభాస్ అనుష్క జోడీకి టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు ఉందనే సంగతి తెలిసిందే. ప్రభాస్ అనుష్క నాలుగు సినిమాలలో కలిసి నటించగా ఈ నాలుగు సినిమాలు ఒక సినిమాను మించి మరొకటి సక్సెస్ సాధించాయి. ఈ కాంబినేషన్ లో బిల్లా, మిర్చి, బాహుబలి ది బిగినింగ్, బాహుబలి ది కంక్లూజన్ సినిమాలు తెరకెక్కగా ఈ సినిమాలు అంచనాలను మించి సక్సెస్ సాధించడం గమనార్హం. మెహర్ రమేష్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రభాస్ అనుష్క జోడీ గురించి షాకింగ్ కామెంట్లు చేశారు.

మెహర్ రమేష్ ప్రభాస్ అనుష్క జోడీ గురించి వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రభాస్ అనుష్క జోడీ ఇండియాలోనే బెస్ట్ జోడీ అని మెహర్ రమేష్ కామెంట్లు చేయడం గమనార్హం. బిల్లా మూవీలో అనుష్క గ్లామరస్ గా కనిపించిందని మెహర్ రమేష్ చెప్పుకొచ్చారు. బిల్లా సినిమాలో అనుష్క హాట్ గా కనిపించిందని మెహర్ రమేష్ పేర్కొన్నారు. బొమ్మాళీ బొమ్మాళీ సాంగ్ ను కంపోజ్ చేస్తున్నామని చెబితే ప్రభాస్, అనుష్క మొదట నమ్మలేదని మణిశర్మ అద్భుతంగా ఆ సాంగ్ ను కంపోజ్ చేశారని మెహర్ రమేష్ చెప్పుకొచ్చారు.

అనుష్క బికినీలో ఎంత అందంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని మెహర్ రమేష్ కామెంట్లు చేయడం గమనార్హం. బిల్లా సినిమా తర్వాత అనుష్క మరే సినిమాలో బికినీలో నటించలేదనే సంగతి తెలిసిందే. అనుష్క ప్రస్తుతం పరిమితంగా సినిమాలలో నటిస్తున్నారు. అనుష్క నవీన్ పోలిశెట్టి కాంబోలో ఒక సినిమా తెరకెక్కాల్సి ఉండగా ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందో చూడాల్సి ఉంది.

అనుష్క ఒక్కో ప్రాజెక్ట్ కు 2 కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషికం తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది. మెహర్ రమేష్ ప్రస్తుతం చిరంజీవితో భోళా శంకర్ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో మెహర్ రమేష్ సక్సెస్ ను అందుకుంటారో లేదో చూడాలి.

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus