Meher Ramesh, Pawan Kalyan: పవర్ స్టార్ తో సినిమా పక్కా… మెహర్ రమేష్ కామెంట్స్ వైరల్!

దర్శకుడు మెహర్ రమేష్ టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవితో సినిమా తీసే అవకాశాన్ని సంపాదించి తన అదృష్టాన్ని మరోసారి పరీక్షించుకుంటున్నాడు. చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో భారీ అంచనాలతో రూపొందుతున్న మూవీ భోళా శంకర్. ఈ మూవీ తమిళంలో ఘన విజయం సాధించిన వేదాళంకి రీమేక్ గా తెలుగులో తెరకెక్కుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. సినిమా రిలీజ్ తర్వాత ఎలాంటి ఫలితాలను ఇస్తుందో వేచి చూడాల్సిందే.

మెహర్ రమేష్ టాలీవుడ్ లో ఇప్పటికి శక్తి, కంత్రి, బిల్లా, షాడో వంటి భారీ బడ్జెట్ సినిమాలు తీసి ప్రేక్షకుల మన్ననలు పొందలేకపోయాడు. వీటిల్లో బిల్లా సినిమా ఒక్కటి యావరేజ్ గా నిలిచింది. బిల్లా సినిమా స్క్రీన్ ప్లే అద్భుతంగా ఉండడంతో ప్రేక్షకులను మెప్పించగలిగింది. అయితే ప్రభాస్ కెరీర్ లో బిల్లా సినిమా ఓ మైలురాయిగా చెప్పొచ్చు. మిగతా సినిమాలన్నీ అట్టర్ ఫ్లాప్ కావడంతో అప్పటి నుంచి తమ అభిమాన హీరోలు మెహర్ రమేష్ దర్శకత్వంలో నటించకపోవడమే మంచిదని అభిమానులు కోరుకుంటారు

తాజాగా ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా బిల్లా సినిమాని రీ రిలీజ్ చేశారు.ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది.రిలీజ్ ప్రమోషన్స్ లో భాగంగా మెహర్ రమేష్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ హీరోగా అద్భుతమైన సినిమాను కచ్చితంగా చేస్తానని ఇంటర్వ్యూలో చెప్పాడు.

ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీనికి స్పందించిన పవన్ కళ్యాణ్ అభిమానులు మెహర్ రమేష్ దర్శకత్వంలో మాత్రం సినిమాను చేయొద్దు అన్నా అంటూ కామెంట్ పెడుతున్నారు. వేచి చూడాలి మరి మెహర్ రమేష్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో సినిమా వస్తుందో రాదో

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus