Meher Ramesh, Jr NTR: ఆ ఫ్లాప్ సినిమాల కారణంగా ఎన్టీఆర్ మెహర్ రమేష్ మధ్య మాటల్లేవా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడిగా పలు సినిమాలను తెరకెక్కించినప్పటికీ పెద్దగా సక్సెస్ అందుకోకపోవడమే కాకుండా ఫ్లాప్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్నారు డైరెక్టర్ మెహర్ రమేష్. ఈయన దర్శకత్వంలో వచ్చిన బిల్లా సినిమా మినహా మిగిలిన కంత్రి, శక్తి,షాడో వంటి సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద ప్లాప్ అయ్యాయి. ఈ క్రమంలోనే ఫ్లాప్ డైరెక్టర్ గా ఈయన పేరుపొందారు. అయితే ఈయనపై నమ్మకంతో మెగాస్టార్ చిరంజీవి ఈయనకు సినిమా అవకాశాన్ని కల్పించారు.

ఇకపోతే తాజాగా ఈయన దర్శకత్వంలో వచ్చిన బిల్లా సినిమాని తిరిగి విడుదల చేయడంతో మెహర్ రమేష్ పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి మెహర్ రమేష్ కు ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఎదురయింది. మెహర్ రమేష్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన శక్తి కంత్రి రెండు సినిమాలు ఫ్లాప్ కావడంతో ఇద్దరి మధ్య మాటలు లేవు అనే ప్రశ్న ఎదురయింది.

ఈ విధంగా మెహర్ రమేష్ ఈ ప్రశ్నకు సమాధానం చెబుతూ ఎన్టీఆర్ హీరోగా నటించిన కంత్రి సినిమా అద్భుతమైన విజయమందుకుంది. ఈ సినిమాకు పెట్టిన పెట్టుబడి మొత్తం రాబట్టి సినిమా లాభాలను అందుకుంది అంటూ వెల్లడించారు.ముఖ్యంగా అమెరికాలో కంత్రి సినిమా ఎంతో అద్భుతమైన కలెక్షన్లను రాబట్టిందని తెలిపారు.ఇక శక్తి సినిమాని అనుకున్న విధంగా పూర్తి చేయలేకపోయామని తెలిపారు.

ఇకపోతే ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ ఎన్టీఆర్ కి ఇప్పుడు ఉన్నంత పరిణితి అప్పుడు లేదని,ప్రస్తుతం ఆయన కథల ఎంపిక విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు అంటూ ఈయన సమాధానం చెప్పారు.ఈ విధంగా మెహర్ రమేష్ మాటలు చూస్తుంటే కచ్చితంగా వీరిద్దరి మధ్య దూరం ఏర్పడిందని స్పష్టంగా అర్థం అవుతుంది.మరి మెహర్ రమేష్ ప్రస్తుతం చిరంజీవితో సినిమా చేస్తున్నారు. ఈ సినిమాతో హిట్ కొట్టి డైరెక్టర్ గా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటారా లేదంటే ఫ్లాప్ డైరెక్టర్ అనే పేరును అలాగే కొనసాగిస్తారా అనే విషయం తెలియాల్సి ఉంది.

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus