సినీ ఇండస్ట్రీలో కొనసాగాలి అంటే హార్డ్ వర్క్ తో పాటు లక్ కూడా ఉండాలని చాలా మంది అంటుంటారు. అందరూ హార్డ్ వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతారు.. కానీ ‘లక్’ అంటే ఎలా ఉంటుంది అని సందేహపడేవాళ్ళకి నిలువెత్తు నిదర్శనం దర్శకుడు మెహర్ రమేష్ అని చెప్పొచ్చు. ఆయన కెరీర్ ప్రారంభంలో ఇక్కడ అట్టర్ ఫ్లాప్ అయిన ‘ఆంద్రావాలా’ సినిమాని కన్నడంలో తీసి సూపర్ హిట్టు కొట్టాడు అనే ఒకే ఒక్క కారణంతో ఎన్టీఆర్- అశ్వినీదత్ లు ‘కంత్రి’ సినిమా చేసే అవకాశం ఇచ్చేసారు. మెహర్ అదృష్టం బాగుండి ఆ చిత్రం కమర్షియల్ గా వర్కౌట్ అయిపోయింది.
తరువాత ప్రభాస్ తో ‘బిల్లా’ చేసాడు. ఆ సినిమా కూడా బాగానే ఉన్నప్పటికీ.. అప్పటికి ప్రభాస్ మార్కెట్ కు మించి బడ్జెట్ పెట్టించేసి.. ఆ చిత్రాన్ని యావరేజ్ అనేలా చేసాడు. ఇక తరువాత చేసిన ‘శక్తి’ ‘షాడో’ ల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఆ చిత్రాలకు మెహర్ పెట్టించిన బడ్జెట్లకు నిర్మాతలు కొన్నేళ్ళ వరకూ అడ్రెస్ లేకుండా పోయారు. తరువాత మెహర్ కు ఛాన్స్ ఇవ్వడానికి చాలా మంది భయపడ్డారు. కానీ మన మెగాస్టార్ చిరంజీవి సింగిల్ సిట్టింగ్లో మెహర్ స్క్రిప్ట్ ను ఓకే చేశాడట. ‘వేదాలం’ రీమేక్ ను చిరుతో తెరకెక్కించబోతున్నాడు మెహర్ రమేష్.
అనిల్ సుంకర ఈ చిత్రానికి నిర్మాత. మెహర్ రమేష్ స్క్రిప్ట్ చెప్పే విధానం చాలా బాగుంటుందని ఇండస్ట్రీలో చాలా మంది చెబుతుంటారు. బహుశా అలాగే చిరుని బుట్టలో పడేసి ఉంటాడు అని కూడా కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ ప్రాజెక్టుని కేవలం 4నెలల్లోనే ఫినిష్ చెయ్యాలని మెహర్ కు చిరు డెడ్ లైన్ పెట్టాడని కూడా టాక్. మరి ఏంచేస్తాడో చూడాలి..!
Most Recommended Video
బిగ్‌బాస్ 4: ఆ ఒక్క కంటెస్టెంట్ కే.. ఎపిసోడ్ కు లక్ష ఇస్తున్నారట..!
గంగవ్వ గురించి మనకు తెలియని నిజాలు..!
హీరోలే కాదు ఈ టెక్నీషియన్లు కూడా బ్యాక్ – గ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చినవాళ్ళే..!