విచిత్రమైన ఫోజుతో సెల్ఫీ తీసుకున్న మెహ్రీన్, తమన్నా

ఇది సెల్ఫీల కాలం. ఫోటోలకు కొంచెం బుద్ధిగా.. శ్రద్ధగా నిలబడాలి… కానీ ఈ సెల్ఫీలకు కొంచెం వంకరగా స్టైల్ ఇవ్వడం ఆనవాయితీ. అమ్మాయిలయితే ఇంకొంచెం వయ్యారంగా సెల్ఫీలు తీసుకుంటారు. మరి హీరోయిన్స్ అయితే.. ఫస్ట్రేషన్స్ తో ఉన్న వారైతే.. ఇదిగో ఇలాగే ఉంటుంది. కొంచెం భయంకరంగా మెహ్రీన్, తమన్నాలు సెల్ఫీ తీసుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇంకేముంది రకరకాల కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. “ఇద్దరు బ్యూటీలను చూడటానికి రెండు కళ్లు సరిపోవట్లేదు” అని ఒకరు.. “ఇద్దరు ఏంజిల్స్ లుకింగ్ గ్రేట్” అని మరొకరు.. “వాటమ్మా.. వాట్ ఈజ్ దిస్ అమ్మా..” అని ఇంకొకరు కామెంట్స్ పెట్టారు.

వీటిని ఈ ముద్దుగుమ్మలు ఎంజాయ్ చేస్తున్నారు. పటాస్, సుప్రీమ్, రాజా ది గ్రేట్ చిత్రాలతో హ్యాట్రిక్ హిట్ అందుకున్న అనిల్ రావిపూడి ఇప్పుడు “ఎఫ్ 2 ” అనే సినిమా చేస్తున్నారు. ఫన్ అండ్ ఫ్రస్టేషన్ అనే ట్యాగ్‌లైన్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లు కలిసి నటిస్తున్నారు. ఈ మల్టీస్టారర్ సినిమాలో వెంకి సరసన తమన్నా, వరుణ్ సరసన మెహ్రీన్ జంటగా నటిస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీ వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ షూటింగ్ బ్రేక్ లోనే ఈ సెల్ఫీలు తీసుకున్నారు. ఈ సెల్ఫీలే ఎఫ్ 2 లో ఎంతో ఫన్ ఉందని ఇండైరెక్ట్ గా స్పష్టం చేస్తున్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus