Kalki: ‘ప్రాజెక్ట్-K : కల్కి 2898 AD’ గ్లిమ్ప్స్ పై ట్రెండ్ అవుతున్న మీమ్స్!

రెండు రోజుల క్రితం ‘ప్రాజెక్టు కె’ నుండి ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయ్యింది. దాని పై భయంకరమైన ట్రోలింగ్ జరిగింది. అది ఫ్యాన్ మేడ్ పోస్టర్ లా ఉందని.. ఐరన్ మెన్ పోస్టర్ ను కాపీ కొట్టేశారని, ఎవరిదో బాడీకి ప్రభాస్ మొహం అతికించినట్లు ఉందని.. ఇలా ఆ ఫస్ట్ లుక్ గురించి భయంకరమైన ట్రోలింగ్ జరిగింది. అంతేకాదు ‘ఆదిపురుష్’ తో ఆ పోస్టర్ ని పోలుస్తూ ప్రభాస్ ఫ్యాన్స్ కి విసుగు తెప్పించారు యాంటీ ఫ్యాన్స్. ఇక ‘ప్రాజెక్ట్ కె’ గ్లింప్స్ తో మరింత ట్రోలింగ్ మెటీరియల్ వస్తుందని అంతా నెగిటివ్ కామెంట్లు చేశారు.

అయితే తాజాగా రిలీజ్ అయిన గ్లిమ్ప్స్ ఆ నెగిటివ్ అభిప్రాయాలను మార్చేసింది. ట్రోలింగ్ కి దీటైన సమాధానం చెప్పింది అని చెప్పాలి. ఒక నిమిషం 16 సెకన్ల నిడివి కలిగి ఉన్న ఈ గ్లింప్స్ లో ప్రభాస్ సూపర్ నేచురల్ పవర్స్ ఉన్న హీరోగా కనిపించాడు. మొహానికి ముసుగు వేసి అమితాబ్ ను కూడా కొన్ని షాట్స్ లో చూపించారు. ఇక ఈ చిత్రానికి ‘కల్కి 2898 -AD ‘ అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు ప్రకటించారు.

పురాణాల్లో విష్ణువు పదో అవతారాన్ని కల్కి అని అంటుంటారు. ప్రాజెక్ట్ కె అలియాస్ కల్కి 2898 -AD కథ యుగాంతం నేపథ్యంలో ఉండబోతుందని ఈ గ్లింప్స్ ద్వారా స్పష్టం చేశారు.అలాగే ఇందులో ప్రతి విజువల్ కూడా అద్భుతంగా ఉందని చెప్పాలి. హాలీవుడ్ సినిమాలకి ఏమాత్రం తీసిపోని స్థాయిలో ఇందులోని విజువల్స్ ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి గాను సంతోష్ నారాయణ్ ను అలాగే డి.జార్జ్ సినిమాటోగ్రఫీకి ప్రశంసలు కురుస్తున్నాయి. అందుకే ‘ప్రాజెక్ట్ కె : కల్కి 2898 ‘పై కొన్ని మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి. ఇవి చూసిన ప్రభాస్ అభిమానులు కొంత రిలీఫ్ ను దక్కించుకున్నట్టు ఫీలవుతున్నారు. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus