Merry Christmas First Review: విజయ్ సేతుపతి ‘మేరీ క్రిస్మస్’ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

ఇప్పుడున్న పాన్ ఇండియా యాక్టర్స్ లో విజయ్ సేతుపతి ఒకరు. తమిళంలో స్టార్ అయినప్పటికీ తెలుగులో కూడా సూపర్ క్రేజ్ ని సంపాదించుకున్నాడు. హిందీలో కూడా ‘జవాన్’ ‘ఫర్జీ’.. లతో అక్కడి జనాలను కూడా ఇంప్రెస్ చేశాడు. ఇప్పుడు ‘మేరీ క్రిస్మస్’ అనే మరో థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకులను హిందీ ప్రేక్షకులను పలకరించనున్నాడు. ‘బద్లాపూర్’ ‘అందాదున్’ వంటి హిట్ సినిమాలు తెరకెక్కించిన శ్రీరామ్ రాఘవన్ ఈ చిత్రానికి దర్శకుడు. కత్రీనా కైఫ్.. విజయ్ సేతుపతికి జోడీగా నటిస్తోంది.

వాస్తవానికి ఎప్పుడో రిలీజ్ కావాల్సిన సినిమా ఇది. కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు హిందీ, తమిళ భాషల్లో జనవరి 12న విడుదల కాబోతుంది. తెలుగులో మాత్రం కొంచెం లేట్ గా రిలీజ్ కాబోతుంది. ఇక ఈ చిత్రాన్ని ఆల్రెడీ చూసేసినట్టు.. సెన్సార్ సభ్యుడు అని చెప్పుకుని తిరిగే ఫేక్ రివ్యూయర్ ఉమైర్ సంధు తెలిపాడు.

అలాగే ఈ చిత్రం (Merry Christmas) పై తన రివ్యూ కూడా ఇచ్చేశాడు. ‘ఇది ఒక కంప్లీట్ బోరింగ్ సినిమా’ అంటూ రాసుకొచ్చి.. దీనికి 2/5 రేటింగ్ ఇచ్చాడు. 2024 లో ఇండియా వైడ్ గా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల లిస్ట్ లో ‘మేరీ క్రిస్మస్’ కూడా ఉంది. ఇది టాప్ -14 వ మూవీగా నిలిచింది. అంత హైప్ ఉన్న సినిమాపై.. అసలు సినిమా చూశాడో లేదో తెలియని వ్యక్తి ఇలా నెగిటివ్ రివ్యూ ఇవ్వడం గమనార్హం.

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus