నెల్లూరు జిల్లా వెంకటగిరికి చెందిన ‘కుమార్ కాసారం’కు చిన్నప్పటి నుంచి సినిమాలంటే మక్కువ. బీటెక్ పూర్తి చేసిన తర్వాత సాఫ్ట్ వేర్ కంపెనీ లో పనిచేస్తూ షార్ట్ ఫిల్మ్స్ లో యాక్ట్ చేయడం మొదలుపెట్టారు. అయినప్పటికీ, సినిమాలపై అతని ప్రేమ ఎప్పుడూ తగ్గలేదు. సినిమా పరిశ్రమలో వృత్తిని కొనసాగించడానికి తన ఉద్యోగాన్ని సైతం విడిచిపెట్టాడు. మజిలీ, ఓ బేబీ, సర్ & కొండ వంటి సినిమాల్లో యాక్టర్ గా నిడివి తక్కువ ఉన్నప్పటికీ ప్రేక్షకులని బాగా ఆకట్టుకున్నాడు.
‘మీటర్’ మూవీ దర్శకుడు రమేష్ యూట్యూబ్‌లో కుమార్ కాసారం షార్ట్ ఫిల్మ్ చూసి ఇంప్రెస్ అవ్వడంతో మీటర్ మూవీలో మంచి పాత్ర లభించింది. అంతేకాదు, హీరో కిరణ్ అబ్బవరం మీటర్ ప్రీ-రిలీజ్ ఫంక్షన్‌లో వీల్లద్దరి షార్ట్ ఫిల్మ్ జర్నీ ని గుర్తు చేస్తూ, ‘కుమార్ కాసారం’ ప్రతిభ, కృషిని అందరి ముందు అభినందించడంతో కిరణ్ అబ్బవరం మీద ప్రేక్షకులకి అభిమానం మరింత రెట్టింపు అయ్యింది.
‘మీటర్’ ప్రీ రీలిజ్ తరువాత కుమార్ కాసారంకి పెద్ద సినిమాల్లో ఆఫర్లు వస్తున్నాయట. ఇప్పటికే, పెద్ద బేనర్ లో హీరోగా ఓ చిత్రాన్ని పూర్తి చేశాడు. ఈ మధ్యనే, కొత్త బ్యానర్‌లో మరో చిత్రానికి సైన్ చేశారు.
కుమార్ కాసారం ప్రయాణం ఎందరో ఔత్సాహిక నటులకు ప్రేరణ. తన ప్రతిభతో, కఠోర శ్రమతో బుల్లితెరపై అడుగుపెట్టి తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. మీటర్ పూర్తి పైసా వసూల్ సినిమా అని, ప్రేక్షకులను అలరిస్తుందని అభిప్రాయపడ్డారు.