Meter: మీటర్ టీమ్ కాన్ఫిడెన్స్ అదేనట.. !

మాస్ మహారాజ్ రవితేజ నటించిన రావణాసుర చిత్రం ఏప్రిల్ 7న రిలీజ్ కాబోతోంది. రవితేజ గత చిత్రాలు ధమాకా డబుల్ బ్లాక్ బస్టర్ అయ్యింది. ఇక గెస్ట్ రోల్ చేసిన వాల్తేరు వీరయ్య సినిమా కూడా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. సో అతను ఫుల్ ఫాంలో ఉన్నట్టే. కానీ మరో వారం రోజుల్లో రాబోతున్న రావణాసుర మూవీ పై పెద్దగా బజ్ లేదు. అందుకు కారణం.. ఇది ఓ థ్రిల్లర్ మూవీ. టీజర్, ట్రైలర్ లు చాలా సీరియస్ గా కనిపిస్తున్నాయి.

రవితేజ మూవీ అంటే కామెడీ,మాస్ డైలాగులు ఉండాలి. అయినప్పటికీ ఓపెనింగ్స్ అయితే వీకెండ్ వరకు గట్టిగా నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే దీనిని పట్టించుకోకుండా మీటర్ అనే చిత్రంతో కిరణ్ అబ్బవరం పోటీపడడానికి రెడీ అయిపోయాడు. ఓ రకంగా ఇది రిస్కే..! అయినా ఇలా మీటర్ సినిమాని రవితేజ సినిమాతో పోటీకి దింపడానికి కారణం ఏంటని దర్శకుడిని అడిగితే.. ‘ మీటర్ కథ మీద ఉన్న నమ్మకం ‘ అని అంటున్నాడు.

పైకి టీమ్ అంతా ఇదే మాట చెబుతున్నారు. అయితే టీమ్ (Meter) పరోక్షంగా చెప్పే టాక్ వేరేలా ఉంది. రవితేజ సినిమా అయితే బ్లాక్ బస్టర్ అవుతుంది లేకపోతే డిజాస్టర్ అవుతుంది. ఒకవేళ ఆ సినిమా బాలేదు అంటే నిలబడదు. అదే మా సినిమా బాగుంటే నిలబడుతుంది. పైగా పరీక్షల సీజన్ ముగుస్తుంది కాబట్టి.. ప్రేక్షకులు రెండు, మూడు పెద్ద సినిమాలు ఉన్నా చూస్తారు. అదే మా బలమైన నమ్మకం.’ అంటూ చెబుతున్నారు.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus