Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » మెట్రో

మెట్రో

  • March 17, 2017 / 09:42 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మెట్రో

తమిళనాట గతేడాది విడుదలై ఘన విజయం సొంతం చేసుకొన్న చిన్న చిత్రాల్లో ఒకటి “మెట్రో”. చైన్ స్నాచింగ్ నేపధ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని తెలుగులో అదే పేరుతో అనువదించి విడుదల చేశారు. తమిళ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకొన్న “మెట్రో” తెలుగువారికి ఏమేరకు నచ్చుతుందో చూద్దాం..!!

కథ : రిటరైన తండ్రి పెన్షన్, కొత్తగా ఉద్యోగంలో చేరిన కొడుకు ఆది (శిరీష్) వచ్చే నెల జీతంతో ఇల్లు గడిపే ఓ ఇల్లాలు.. ఇలా ఒకే ఇంట్లోని వారందరూ దొరికినదాంతో సరిపెట్టుకుందామనే ఆలోచనాధోరణితో జీవితాన్ని వెళ్లదీస్తుంటారు. కానీ.. చిన్నకొడుకు మధు (సత్య) మాత్రం తప్పుడు మార్గంలోనైనా డబ్బు సంపాదించి బండి, కాస్ట్లీ ఫోన్ కొనుక్కోవాలనుకొంటాడు. అందుకు “చైన్ స్నాచింగ్”ను సరైన మార్గంగా ఎంచుకొంటాడు. అప్పటికే చైన్ స్నాచింగ్ బిజినెస్ లో మంచి పలుకుబడి ఉన్న గుణ (బాబీ సింహా) బృందంతో కలిసి నగరంలో చోరీలు మొదలుపెట్టి చేతినిండా డబ్బు సంపాదిస్తుంటాడు.అంతా సజావుగా సాగుతుందనుకొంటున్న సమయంలో తాను చేస్తున్న చైన్ స్నాచింగ్ ల కారణంగా మధు కుటుంబానికే తీరని చేటు జరుగుతుంది. ఏమిటా చేటు, చివరికి మధు జీవితం ఏ తీరానికి చేరింది వంటి ప్రశ్నలకు సమాధానమే “మెట్రో”.

నటీనటుల పనితీరు : నటీనటులందరూ దాదాపుగా కొత్తవారే ఒక్క బాబీ సింహా తప్ప. అయితే.. కొత్త కుర్రాడైన సత్య రెండు విభిన్నమైన షేడ్స్ ను సరికొత్తగా పండించాడు. డ్రగ్ ఎడిక్ట్ గా బాబీ సింహా, తల్లి పాత్రలో తులసి తమ సీనియారిటీని ప్రూవ్ చేసుకోగా.. మెయిన్ లీడ్ గా నటించిన శిరీష్ మాత్రం తేలిపోయాడు. సీరియస్ నెస్, కామెడీ, లవ్ లాంటి అన్ని రకాల ఎమోషన్స్ కి ఒకే రకమైన ఎక్స్ ప్రెషన్ తో కాస్త ఇబ్బందిపెట్టాడు.

సాంకేతికవర్గం పనితీరు : సినిమాటోగ్రఫీ వర్క్ ఈ చిత్రానికి కీలకమైనది. చైన్ స్నాచింగ్ షాట్స్ ను బాగా తీశారు. అలాగే డిమ్ లైటింగ్ షాట్స్, డ్రోన్ షాట్స్ బాగున్నాయి. జోహన్ పాటలు కాస్త విభిన్నంగా ఉండడం కోసం ఎలక్ట్రానిక్ మ్యూజిక్ వాడడం కొట్టగానే ఉన్నా వినడానికి మాత్రం కాస్త ఇబ్బందిగా ఉంటుంది. నేపధ్య సంగీతం మాత్రం ఎమోషన్ ను చక్కగా ఎలివేట్ చేసింది. నిర్మాణ విలువలు, ఎడిటింగ్ కథకు తగ్గట్లుగా ఉన్నాయి. దర్శకుడు ఆనంద కృష్ణన్ “చైన్ స్నాచింగ్” అంశానికి మదర్ సెంటిమెంట్ ను జోడించి కథను రాసుకొన్న విధానం, దాన్ని కథనంలో ఎలివేట్ చేసిన విధానం బాగున్నాయి. అయితే.. స్క్రీన్ ప్లేలో కాస్త ల్యాగ్ ఎక్కువయ్యింది. అలాగే.. చాలా లాజిక్స్ మిస్ అయ్యాడు. ఇంట్లో కొడుకు లక్షల విలువైన వస్తువులు వాడుతున్నా ఇంట్లో ఎవరూ పట్టించుకోకపోవడం, కాలేజ్ అటెండన్స్ చెక్ చేయకపోవడం వంటివి వాటిని గాలికొదిలేశారు. అయితే.. మదర్ సెంటిమెంట్ ను బాగా ఎలివేట్ చేయడంతో మిగతావన్నీ ప్రేక్షకుల బుర్ర వరకూ చేరే అవకాశాలు తక్కువ.

విశ్లేషణ : “చైన్ స్నాచింగ్” నేపధ్యంలో సెంటిమెంట్ ను మేళవించి తెరకెక్కించిన చిత్రం “మెట్రో”. డబ్బింగ్ వర్క్ కాస్త గజిబిజిగా ఉన్నా.. కథ-కథనాల్లో ఉన్న ఇంటెన్సిటీ కారణంగా ఆడియన్స్ సినిమాలో లీనమైపోతారు. టైమ్ పాస్ కోసం చూడదగ్గ చిత్రమిది.

రేటింగ్ : 2.5/5

Click Here For ENGLISH Review

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bobby Simha
  • #Bobby Simha Movies
  • #Metro Movie
  • #Metro Movie Rating
  • #Metro Movie Review

Also Read

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi Collections:  3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

related news

Peddi Review in Telugu: పెద్ది సినిమా రివ్యూ & రేటింగ్!

Peddi Review in Telugu: పెద్ది సినిమా రివ్యూ & రేటింగ్!

Mareechika Review in Telugu: మ‌రీచిక సినిమా రివ్యూ & రేటింగ్!

Mareechika Review in Telugu: మ‌రీచిక సినిమా రివ్యూ & రేటింగ్!

Trikala Review in Telugu: త్రికాల సినిమా రివ్యూ & రేటింగ్!

Trikala Review in Telugu: త్రికాల సినిమా రివ్యూ & రేటింగ్!

Kattalan Review in Telugu: కాటాలన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kattalan Review in Telugu: కాటాలన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Blast Zone Review in Telugu: బ్లాస్ట్ జోన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Blast Zone Review in Telugu: బ్లాస్ట్ జోన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Colony Circus Review in Telugu: ‘కాలనీ సర్కస్'(కథా సుధ) సినిమా రివ్యూ & రేటింగ్!

Colony Circus Review in Telugu: ‘కాలనీ సర్కస్'(కథా సుధ) సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

3 mins ago
Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

21 mins ago
Peddi Collections:  3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

58 mins ago
Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

24 hours ago
OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

1 day ago

latest news

CBFC: తత్కాల్‌ను రద్దు చేసేసిన సెన్సార్‌ బోర్డు.. సినిమాలకు పెద్ద తలనొప్పే

CBFC: తత్కాల్‌ను రద్దు చేసేసిన సెన్సార్‌ బోర్డు.. సినిమాలకు పెద్ద తలనొప్పే

1 day ago
10 సినిమాలతో లైనప్‌ రెడీ చేసిన స్టార్‌ హీరో.. ఎవరా హీరో.. ఏంటా సినిమాలు

10 సినిమాలతో లైనప్‌ రెడీ చేసిన స్టార్‌ హీరో.. ఎవరా హీరో.. ఏంటా సినిమాలు

1 day ago
Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

1 day ago
Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

1 day ago
Imax – Dollby – 70 MM: ఐమ్యాక్స్‌.. డాల్బీ…  70ఎంఎం… ఈ స్క్రీన్ల మధ్య డిఫరెన్స్‌ జస్ట్‌ 21 సెకన్లలో

Imax – Dollby – 70 MM: ఐమ్యాక్స్‌.. డాల్బీ… 70ఎంఎం… ఈ స్క్రీన్ల మధ్య డిఫరెన్స్‌ జస్ట్‌ 21 సెకన్లలో

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version