నాని ప్రొడక్షన్ లో సినిమా కన్ఫర్మ్, అక్టోబర్ లో ఆరంభం!

“వెళ్లిపోమాకే”తో తెలుగు తెరకు పరిచయమైన విశ్వక్ సేన్.. “ఈ నగరానికి ఏమైంది”తో సూపర్ హిట్ సొంతం చేసుకొని తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు కూడా సంపాదించుకొన్నాడు. ఇక “ఫలక్ నుమా దాస్”తో దర్శకుడిగా కూడా మారి పర్వాలేదనిపించుకొన్నాడు. మలయాళ హిట్ సినిమా “అంగమలై డైరీస్”కు రీమేక్ గా రూపొందిన ఆ చిత్రం తెలుగులో ఓ మోస్తరు హిట్ గా నిలిచింది. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లోనే నాని తన నిర్మాణంలో విశ్వక్ సేన్ హీరోగా ఒక సినిమా తీస్తాను అని చెప్పినప్పటికీ.. అనంతరం విశ్వక్ సేన్ యాటిట్యూడ్ & కొందరిని లైవ్ లో బూతులు తిట్టడం అనేది పెద్ద మైనస్ గా మారింది. దాంతో నాని వెనక్కి తగ్గాడని వార్తలొచ్చాయి.

తాజా సమాచారం మేరకు.. నాని ప్రామిస్ చేసినట్లుగా సినిమా త్వరలోనే ఎనౌన్స్ మెంట్ జరగనుందని.. ఆల్రెడీ ప్రీప్రొడక్షన్ వర్క్ కూడా పుర్తైందని తెలుస్తోంది. ఆల్రెడీ విశ్వక్ సేన్ హీరోగా సురేష్ బాబు హిందీ సూపర్ హిట్ చిత్రం “సోనూ కే టీటూ కి స్వీటీ”ని రీమేక్ చేస్తుండగా.. ఇప్పుడు నాని ప్రొడక్షన్ లో సినిమా కూడా కన్ఫర్మ్ అవ్వడంతో విశ్వక్ కెరీర్ ఒక్కసారిగా ఫుల్ స్వింగ్ లోకి వచ్చేసింది.

గ్యాంగ్‌ లీడర్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
పహిల్వాన్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus