Roja,Balakrishna: యూనివర్సిటీ వివాదంపై బాలకృష్ణకు కౌంటర్ ఇచ్చిన రోజా!

ఆంధ్రప్రదేశ్ లో హెల్త్ యూనివర్సిటీ వివాదం రోజురోజుకు ముదురుతుంది. విజయవాడలో ఉన్నటువంటి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి పేరును మారుస్తూ తీసుకున్న నిర్ణయం పై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్టీఆర్ పేరును తొలగించి వైఎస్ఆర్ పేరు పెట్టడాన్ని తెలుగుదేశం పార్టీ నేతలు, నందమూరి అభిమానులకు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలోనే ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ వివాదం పై నందమూరి కుటుంబ సభ్యులు ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ జగన్ ప్రభుత్వం పై మండిపడిన విషయం మనకు తెలిసిందే.

ఇప్పటికే కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్, బాలకృష్ణ, రామకృష్ణ వంటి తదితరులు ఎన్టీఆర్ పేరు మార్చడాన్ని వ్యతిరేకించారు. ఇక ఎన్టీఆర్ కుమారుడిగా హిందూపురం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నటువంటి బాలకృష్ణ ఈ విషయంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై తెలుగుదేశం నేతలు విమర్శలు చేయగా వైసిపి మంత్రులు తమదైన శైలిలో గట్టిగా కౌంటర్ ఇస్తున్నారు.ఇకపోతే ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై మంత్రి రోజా తీవ్రస్థాయిలో ఖండించారు.

ఈ సందర్భంగా రోజా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఫ్లూటు చంద్రబాబు ముందు ఊదు జ “గన్” ముందు కాదు. తేడా వస్తే దబిడి దిబిడే అంటూ కౌంటర్ ఇచ్చారు. ఈ విధంగా ఎన్టీఆర్ పేరు మార్చి వైయస్సార్ పేరు పెట్టడం పట్ల కేవలం నందమూరి కుటుంబ సభ్యులు మాత్రమే కాకుండా తెలుగుదేశం నేతలు కూడా ఈ విషయంపై తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేస్తున్నారు.

అలాగే పలువురు సినీ ప్రముఖులు సైతం ఈ విషయంపై స్పందిస్తూ ఎన్టీఆర్ పేరు మార్చడానికి తప్పు పడుతున్నారు. మరి ఈ వివాదం ఇంతటితో ఆగుతుందా లేక ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో తెలియాల్సి ఉంది.

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

శాకిని డాకిని సినిమా రివ్యూ & రేటింగ్!
నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ గీతు రాయల్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus