Talasani: నంది అవార్డులపై తెలంగాణ మంత్రి రియాక్షన్‌.. ఏమన్నారంటే?

  • May 6, 2023 / 04:29 PM IST

నంది అవార్డులపై తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదు అంటూ.. ఇటీవల అగ్ర నిర్మాతలు ఆదిశేషగిరిరావు, అశ్వనీదత్‌ ఘాటుగా విమర్శించిన విషయం తెలిసిందే. దానికి ఆంధ్రప్రదేశ్‌ వైపు నుండి పోసాని కృష్ణ మురళి అంతే ఘాటుగా స్పందించారు కూడా. అయితే తెలంగాణ వైపు నుండి ఎవరూ స్పందించలేదేంటి? ఇక్కడి ప్రభుత్వం మాటేంటి అని అందరూ వెయిట్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ సినిమాటోగ్రీఫీ మినిస్టర్‌ తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ స్పందించారు. రాష్ట్ర విభజన జరిగాక నంది అవార్డులు ఆపేసిన మాట వాస్తవమేనని చెప్పారు.

‘‘నంది అవార్డుల విషయం చెప్పే వాళ్లకు చెప్పాలి కానీ, తమలో తాము మాట్లాడుకుంటే ఏం ఉపయోగం’’ అంటూ తలసాని ఘాటుగా స్పందించారు. తెలంగాణ ప్రభుత్వం చిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తోంది.. తప్పకుండా వచ్చే ఏడాది నుండి రాష్ట్ర ప్రభుత్వం తరపున నంది అవార్డులు ఇస్తామని మంత్రి ప్రకటించారు. అయినా నంది అవార్డుల విషయంపై తెలంగాణ ప్రభుత్వానికి ఎలాంటి ప్రతిపాదన రాలేదని ఆయన చెప్పారు. సినీ పరిశ్రమ నుండి ఈ విషయంలో ఎవరూ తమను అడగలేదని చెప్పారు.

అయితే కొంతమంది మీడియా కనిపించగానే అత్యుత్సాహాంగా మాట్లాడుతున్నారని నంది అవార్డుల గురించి ఈ చర్చను రేపిన వారి గురించి మంత్రి తలసాని విమర్శించారు. నంది అవార్డులను ఎవరు పడితే వాళ్లు అడిగితే ఇచ్చేవి కావని మంత్రి తలసాని అన్నారు. బాధ్యతాయుతమైన వ్యక్తులెవరూ నంది అవార్డుల విషయంలో ప్రభుత్వాన్ని సంప్రదించలేదని మరోసారి స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో మరి టాలీవుడ్‌ నుండి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.

అయితే గతంలో ఏటా నంది అవార్డుల కోసం ఓ కమిటీ ఏర్పాటయ్యేది. అయితే  (Talasani) మంత్రి మాటల్లో కమిటీ ప్రస్తావన లేదు. అయితే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక నంది అవార్డులను సింహా అవార్డుల పేరుతో ఇస్తామని అప్పట్లో ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఇప్పటివరకు అలాంటి ప్రకటన అధికారికంగా ఏమీ జరగలేదు. వచ్చే ఏడాది నుండి ఇస్తామన్న పురస్కారాలు ఏ పేరుతో ఇస్తారో చూడాలి.

ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!

బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus