‘ఖైదీ నెంబర్ 150’ తర్వాత మెగాస్టార్ చిరంజీవి చేసిన సినిమాలు ఫ్యాన్స్ కు ఆకట్టుకోలేదు అనే చెప్పాలి. అందుకు ఆ చిత్రాలు సాధించిన బాక్సాఫీస్ రిజల్ట్స్ సాక్ష్యం. ‘సైరా’ ‘గాడ్ ఫాదర్’ హిట్ టాక్ ను రాబట్టుకున్నాయి కానీ అందులో మెగాస్టార్ మార్క్ మిస్ అయ్యింది. అయితే బాబీ సినిమాలో చిరు ఓ మాస్ సినిమా చేస్తున్నారు. ఇందులో ‘నా అభిమానులు నా నుండి ఆశించే అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి’ అని చిరు ‘గాడ్ ఫాదర్’ ప్రమోషన్స్ లో చెప్పారు.
ఈ చిత్రానికి ‘వాల్తేరు వీరయ్య’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం జరిగింది. చివరికి ఆ ప్రచారాన్ని నిజం చేస్తూ ఈరోజు దీపావళి కానుకగా ఓ టైటిల్ టీజర్ ను వదిలింది చిత్ర బృందం.హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో తీసిన యాక్షన్ ఎపిసోడ్ కు సంబంధించిన చిన్న ఫైట్ సీక్వెన్స్ ను ఈ టైటిల్ టీజర్ గా విడుదల చేశారు. ‘ఏంట్రా.. వాడొస్తే పూనకాలన్నారు.. అడుగేస్తే అరాచకం అన్నారు..కానీ సౌండే లేదు’ అంటూ విలన్ అంటే.. ఓ బాంబ్ పేలడం..
దాని బ్యాక్ గ్రౌండ్ లో చిరు ఉన్నట్టు చూపించడం నిజంగానే పూనకాలు లోడింగ్ కి జస్టిఫికేషన్ ఇచ్చాయి.ఇలాంటి ఎంటర్ టైన్మెంట్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే.. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు’’ అంటూ చిరు చెప్పి నోట్లో బీడీ పెట్టుకుని నడుచుకుంటూ రావడం, ఆయన లుంగీ లో కనిపించడం అందరికీ ‘ముఠామేస్త్రి’ రోజులను గుర్తు చేశాయి. అంతా బాగానే ఉంది ఈ టీజర్ కు దేవి శ్రీ ప్రసాద్ అందించిన నేపధ్య సంగీతం చాలా రొటీన్ గా ఉంది.
‘గబ్బర్ సింగ్’ ‘లెజెండ్’ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ‘రంగస్థలం’ ‘సరిలేరు నీకెవ్వరు’…. సినిమాల్లోని టైటిల్ సాంగ్స్ లో వచ్చే మ్యూజిక్ ను ఇంకొన్ని డప్పుల సౌండ్ పెంచి వడ్డించినట్లు ఉందని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో చాలా వరకు దేవి మిడ్ రేంజ్ సినిమాలకే మ్యూజిక్ అందిస్తున్నాడు. ఆయన చేస్తున్న పెద్ద సినిమాలు లెక్కేసుకుంటే అందులో ‘భవదీయుడు భగత్ సింగ్’ ‘పుష్ప 2’ అలాగే ఈ ‘వాల్తేరు వీరయ్య’ మాత్రమే ఉన్నాయి.
ఈ మూడు సినిమాలు మినిమం గ్యారెంటీ అని ప్రేక్షకులు భావిస్తున్నారు. ఇలాంటి టైంలో దేవి కనుక నేపధ్య సంగీతం విషయంలో డిజప్పాయింట్ చేస్తే అతని కెరీర్ ఇంకా దెబ్బతినే ప్రమాదం ఉంది. ఇప్పటికే పెద్ద సినిమాలన్నీ తమన్ కే వెళ్లిపోతున్నాయి. కాబట్టి దేవి ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి.