Mirai First Review: తేజ సజ్జ మరో హిట్టు కొట్టాడా? లేదా?

‘హనుమాన్’ తో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అందుకున్నాడు తేజ సజ్జ. ఆ వెంటనే ‘మిరాయ్’ అనే మరో యాక్షన్ అడ్వెంచర్ అండ్ ఫాంటసీ థ్రిల్లర్ చేశాడు.రితిక నాయక్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో సీనియర్ స్టార్ హీరోయిన్ శ్రీయ, జగపతి బాబు, జయరామ్ వంటి వారు కీలక పాత్రలు పోషించారు. కార్తీక్ ఘట్టమనేని ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ సంస్థపై టి.జి.విశ్వప్రసాద్ దాదాపు రూ.60 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. టీజర్, ట్రైలర్లతోనే బోలెడంత క్రేజ్ సంపాదించుకుంది ఈ సినిమా.

Mirai First Review

మిడ్ రేంజ్ సినిమా అయినప్పటికీ విజువల్స్ చూడటానికి చాలా బాగున్నాయి అని అంతా ప్రశంసించారు. ఈ సినిమాలో కూడా హీరో తేజ సజ్జ సూపర్ పవర్స్ కలిగిన కుర్రాడిగా కనిపించబోతున్నాడు. అలాగే అతన్ని ఢీకొట్టే విలన్ గా మంచు మనోజ్ బ్లాక్ స్వర్డ్ అనే పాత్రలో నటించడం అందరికీ ఆసక్తి కలిగించే అంశం. ‘హనుమాన్’ ఫేమ్ గౌర హరి సంగీతం అందించగా ‘వైబ్ ఉంది బేబీ’ అనే పాటకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

ఇక సెప్టెంబర్ 12న విడుదల కాబోతున్న ‘మిరాయ్’ ని ఆల్రెడీ టాలీవుడ్ కు చెందిన కొంతమంది పెద్దలకు అలాగే తన సన్నిహితులకు నిర్మాత విశ్వప్రసాద్ స్పెషల్ గా షో వేసి చూపించడం జరిగింది. సినిమా చూసిన అనంతరం వారు తమ అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నారు.

‘మిరాయ్’ రన్ టైం 2 గంటల 49 నిమిషాలు ఉంటుందట. హీరో తేజ సజ్జ కంటే కూడా విలన్ మంచు మనోజ్ ఎంట్రీ సీన్ ను బాగా డిజైన్ చేసినట్లు తెలుస్తుంది. మనోజ్ రోల్ వచ్చిన ప్రతిసారి సంగీత దర్శకుడు గౌర హరి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా కంపోజ్ చేసినట్లు చెబుతున్నారు. ఫస్ట్ హాఫ్ టేకాఫ్ అవ్వడానికి కొంచెం ఎక్కువ టైం పట్టిందట. అయినప్పటికీ ప్రీ ఇంటర్వెల్ బ్లాక్, క్లైమాక్స్ బాగా వర్కౌట్ అయ్యాయని అంటున్నారు. క్లైమాక్స్ లో వచ్చే శ్రీరాముని ఎపిసోడ్ కూడా బాగా డిజైన్ చేసినట్లు చెబుతున్నారు. మరి రిలీజ్ రోజు ఎలాంటి టాక్ వస్తుందో చూడాలి.

మండే టెస్ట్ కూడా పాసయ్యింది

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus