సోషల్ మీడియాలో ఫన్ కంటెంట్ చేస్తూ పాపులర్ అయ్యాడు మౌళి. అతని నుండి కొత్త కంటెంట్ వస్తుందంటే నెటిజన్లంతా అలర్ట్ అయిపోయేలా ఇంపాక్ట్ క్రియేట్ చేసుకున్నాడు. ఇప్పుడు ఏకంగా ‘లిటిల్ హార్ట్స్’ అనే సినిమాతో హీరోగా డెబ్యూ కూడా ఇచ్చేశాడు. వంశీ నందిపాటి, బన్నీ వాస్ సమర్పణలో ‘ఈటీవీ విన్’ అధినేతలు అయిన నితిన్, సాయి, 90’s దర్శకుడు ఆదిత్య కలిసి నిర్మించిన సినిమా ఇది.
సాయి మార్తాండ్ దర్శకత్వం వహించాడు. టీజర్, ట్రైలర్ వంటివి మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేశాయి. కంటెంట్ పై ఉన్న కాన్ఫిడెన్స్ తో రిలీజ్ కి ముందే ప్రిమియర్స్ కూడా వేశారు. వాటికి మంచి రెస్పాన్స్ రావడంతో ఓపెనింగ్స్ అదిరిపోయాయి అనే చెప్పాలి. 2 రోజులకే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ సినిమా..3 వ రోజు కూడా అదరగొట్టేసి వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ స్టేటస్ దక్కించుకుంది. మొదటి సోమవారం కూడా సినిమా చాలా బాగా కలెక్ట్ చేసింది. ఒకసారి 4 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 1.81 cr |
సీడెడ్ | 0.42 cr |
ఆంధ్ర(టోటల్) | 2.02 cr |
ఏపీ + తెలంగాణ(టోటల్) | 4.25 cr (షేర్) |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 0.20 cr |
ఓవర్సీస్ | 0.25 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 4.7 cr (షేర్) |
‘లిటిల్ హార్ట్స్’ సినిమాకు రూ.1.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రూ.2 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.4 రోజుల్లో ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రూ.4.7 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది. గ్రాస్ పరంగా రూ.8.42 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ సినిమా 4 రోజుల్లో ఏకంగా రూ.2.7 కోట్ల ప్రాఫిట్స్ తో దూసుకుపోతుంది. సోమవారం రోజున కూడా ఆల్మోస్ట్ ఆదివారం రేంజ్లో షేర్ ను కలెక్ట్ చేసి గ్రోత్ చూపించింది. ‘మదరాసి’ ‘ఘాటి’ వంటి సినిమాలు చాలా స్క్రీన్స్ లో తీసేసి వాటి ప్లేస్ లో ‘లిటిల్ హార్ట్స్’ వేయడంతో కలెక్షన్స్ స్టడీగా ఉన్నాయని చెప్పాలి.